11 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు; ఆమ్రపాలికి పర్యాటక, సాంస్కృతిక శాఖ
జీఏడీలో వెయిటింగ్‌లో ఉన్న ఆమ్రపాలికి కీలక బాధ్యతలు; 9 మందికి కొత్త పోస్టింగ్‌లు, 2 మందికి అదనపు చార్జీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ ద్వారా విడుదలైన ఉత్తర్వుల ప్రకారం, ఆగస్టు నుంచి జీఏడీలో వెయిటింగ్‌లో ఉన్న 2010 బ్యాచ్ అధికారిణి ఆమ్రపాలిని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా నియమించింది.
మొత్తం అధికారుల్లో 9 మందికి కొత్త పోస్టింగ్‌లు ఇవ్వగా, మరో 2 మందికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. మురళీధర్‌ను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా, నీలకంఠరెడ్డిని యువజన సర్వీసుల డైరెక్టర్‌గా, తేజ్‌భారత్‌ను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా నియమించారు. వరప్రసాద్‌కు పౌరసరఫరాల సంస్థ ఎండీగా, బి. అనిల్‌కుమార్‌రెడ్డికి పరిశ్రమలు, వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు ఇచ్చారు.
HIGHLIGHTS
- 11 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు
- ఆమ్రపాలికి పర్యాటక, సాంస్కృతిక శాఖ
- 9 మందికి కొత్త పోస్టింగ్‌లు
- 2 మందికి అదనపు బాధ్యతలు
గెడెల శ్రీనుకుమార్‌ను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ డిప్యూటీ సెక్రటరీగా, మంజుల బాలాజీ దిగంబర్‌ను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శిగా నియమించారు. సౌరభ్ గౌర్‌కు ఏపీ భవన్ బాధ్యతలు అప్పగించారు. ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ కె. శ్రీనివాసులుకు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్‌గా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభం బన్సల్‌కు ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
