99TV News

    APPSC Group 1 నోటిఫికేషన్ 2026: 163 పోస్టులు విడుదల

    APPSC Group 1 Notification 2026 విడుదల.. 163 పోస్టులకు అక్టోబర్ 6 నుంచి దరఖాస్తులు

    APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2026: 163 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల.. అక్టోబర్ 6 నుంచి దరఖాస్తులు

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 సర్వీసుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ నంబర్ 07/2026ను సెప్టెంబర్ 15న జారీ చేసింది. మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

    ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 6, 2026న ప్రారంభమై.. అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

    ఏయే పోస్టులు ఉన్నాయి?

    గ్రూప్-1 నోటిఫికేషన్‌లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్లు సహా మొత్తం 13 కేటగిరీల పోస్టులు ఉన్నాయి.

    అత్యధికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (Civil) పోస్టులు 36, డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు 35 ఉన్నాయి. డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 15, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ పోస్టులు 14, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు 14, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 14 చొప్పున ఉన్నాయి.

    పోస్టు ఖాళీలు

    డిప్యూటీ కలెక్టర్లు -11

    అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ - 14

    DSP Civil Category-II - 36

    DSP Communications - 3

    డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ - 14

    రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ - 3

    డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 1

    డిప్యూటీ రిజిస్ట్రార్ - 15

    మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II - 12

    అసిస్టెంట్ ట్రెజరీ/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 2

    డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ - 3

    అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ - 14

    డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ - 35

    మొత్తం - 163

    విద్యార్హత ఏంటి?

    పోస్ట్ కోడ్ 01 నుంచి 03, 05 నుంచి 13 వరకు ఉన్న పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి.

    డీస్పీ కమ్యూనికేషన్స్ పోస్టుకు మాత్రం సంబంధిత ఇంజినీరింగ్ విద్యార్హత అవసరం. ఎలక్ట్రానిక్స్ and కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ తెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా రేడియో ఇంజనీరింగ్లో B.E./B.Tech ఉండాలి. DSP పోస్టులకు సంబంధించి భౌతిక ప్రమాణాలు కూడా వర్తిస్తాయని APPSC స్పష్టం చేసింది.

    ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది?

    గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ రెండు పేపర్లలో ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 120 ప్రశ్నలు, 120 మార్కులు, 120 నిమిషాల సమయం ఉంటుంది.

    పేపర్-1 – జనరల్ స్టడీస్

    • చరిత్ర, సంస్కృతి

    • రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు

    • భారత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళిక

    • భూగోళశాస్త్రం

    పేపర్-2 – జనరల్ ఆప్టిట్యూడ్

    • జనరల్ మెంటల్ ఎబిలిటీ

    • అడ్మినిస్ట్రేటివ్, సైకాలజికల్ అబిలిటీస్

    • సైన్స్ అండ్ టెక్నాలజీ

    • ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన కరెంట్ అఫైర్స్

    ప్రిలిమ్స్‌లో ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్‌లైన్‌లో OMR విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష తేదీని డిటైల్డ్ నోటిఫికేషన్‌లో ప్రకటించనున్నారు.

    మెయిన్స్‌లో ఐదు పేపర్లు

    గ్రూప్-1 మెయిన్స్‌లో ఐదు ప్రధాన డిస్క్రిప్టివ్ పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 150 మార్కులకు, 180 నిమిషాల వ్యవధితో ఉంటుంది.

    • పేపర్-1: జనరల్ ఎస్సే

    • పేపర్-2: ఇండియా, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం

    • పేపర్-3: పాలిటీ, రాజ్యాంగం, గవర్నెన్స్, లా, ఎథిక్స్

    • పేపర్-4: ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్

    • పేపర్-5: సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్

    ఇవే కాకుండా తెలుగు, ఇంగ్లిష్ భాషా పేపర్లు క్వాలిఫైయింగ్ నేచర్‌లో ఉంటాయి. మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయించారు. మొత్తం ఎంపిక ప్రక్రియలో 825 మార్కులు ఉంటాయి.

    అభ్యర్థులకు కీలక సూచన

    APPSC ప్రకారం ప్రస్తుతం ప్రకటించిన 163 ఖాళీలు ప్రొవిజనల్. సంబంధిత శాఖల నుంచి ఖాళీల నిర్ధారణ అనంతరం వీటిలో మార్పులు ఉండే అవకాశం ఉంది. వయసు, కేటగిరీ వారీగా ఖాళీలు, ఇతర అర్హతలు, పూర్తి నిబంధనలు అక్టోబర్ 6న లేదా అంతకుముందు విడుదలయ్యే డిటైల్డ్ నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.

    అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేసుకోవాలని APPSC సూచించింది. దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తారు.