99TV News

    AP గ్రామ పంచాయతీ ఎన్నికలు 2026 | సర్పంచ్ అభ్యర్థుల జిల్లా వారీ జాబితా

    AP గ్రామ పంచాయతీ ఎన్నికలు 2026 | సర్పంచ్ అభ్యర్థుల జిల్లా వారీ జాబితా

    ఆంధ్రప్రదేశ్‌లో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2026లో భాగంగా ఫేజ్-1 సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా వెల్లడైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం విజయవాడ విడుదల చేసిన ప్రొఫార్మా-IV(a) నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలోని 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాల్లో మొత్తం 3,949 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.

    వీటిలో 758 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 3,191 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 9,052 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

    జిల్లాల వారీగా సర్పంచ్ ఎన్నికల వివరాలు:

    సర్పంచ్ పదవులకు అత్యధికంగా తిరుపతి జిల్లాలో 269 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ జిల్లాలో 135 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 855 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

    ఇతర జిల్లాల వివరాలు పరిశీలిస్తే:

    శ్రీకాకుళం – 173 పంచాయతీలు ఎన్నికలు, 473 మంది అభ్యర్థులు.

    పార్వతీపురం మన్యం – 193 పంచాయతీలు ఎన్నికలు, 547 మంది అభ్యర్థులు.

    విజయనగరం – 183 పంచాయతీలు ఎన్నికలు, 429 మంది అభ్యర్థులు.

    అనకాపల్లి – 183 పంచాయతీలు ఎన్నికలు, 489 మంది అభ్యర్థులు.

    అల్లూరి సీతారామరాజు – 65 పంచాయతీలు ఎన్నికలు, 268 మంది అభ్యర్థులు.

    పోలవరం – 87 పంచాయతీలు ఎన్నికలు, 285 మంది అభ్యర్థులు.

    కాకినాడ – 88 పంచాయతీలు ఎన్నికలు, 265 మంది అభ్యర్థులు.

    డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ – 148 పంచాయతీలు ఎన్నికలు, 395 మంది అభ్యర్థులు.

    తూర్పుగోదావరి – 50 పంచాయతీలు ఎన్నికలు, 148 మంది అభ్యర్థులు.

    పశ్చిమగోదావరి – 80 పంచాయతీలు ఎన్నికలు, 229 మంది అభ్యర్థులు.

    ఏలూరు – 164 పంచాయతీలు ఎన్నికలు, 440 మంది అభ్యర్థులు.

    కృష్ణా – 121 పంచాయతీలు ఎన్నికలు, 305 మంది అభ్యర్థులు.

    ఎన్టీఆర్ – 68 పంచాయతీలు ఎన్నికలు, 179 మంది అభ్యర్థులు.

    బాపట్ల – 62 పంచాయతీలు ఎన్నికలు, 159 మంది అభ్యర్థులు.

    పల్నాడు – 101 పంచాయతీలు ఎన్నికలు, 250 మంది అభ్యర్థులు.

    ప్రకాశం – 77 పంచాయతీలు ఎన్నికలు, 215 మంది అభ్యర్థులు.

    మార్కాపురం – 86 పంచాయతీలు ఎన్నికలు, 258 మంది అభ్యర్థులు.

    ఎస్పీఎస్ఆర్ నెల్లూరు – 114 పంచాయతీలు ఎన్నికలు, 281 మంది అభ్యర్థులు.

    చిత్తూరు – 177 పంచాయతీలు ఎన్నికలు, 494 మంది అభ్యర్థులు.

    అన్నమయ్య – 11 పంచాయతీలు ఎన్నికలు, 37 మంది అభ్యర్థులు.

    వైఎస్సార్ కడప – 127 పంచాయతీలు ఎన్నికలు, 479 మంది అభ్యర్థులు.

    శ్రీ సత్యసాయి – 112 పంచాయతీలు ఎన్నికలు, 320 మంది అభ్యర్థులు.

    అనంతపురం – 210 పంచాయతీలు ఎన్నికలు, 539 మంది అభ్యర్థులు.

    కర్నూలు – 135 పంచాయతీలు ఎన్నికలు, 432 మంది అభ్యర్థులు.

    నంద్యాల – 107 పంచాయతీలు ఎన్నికలు, 281 మంది అభ్యర్థులు.

    ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలు:

    ఏకగ్రీవ ఎన్నికల్లో అన్నమయ్య జిల్లా 74 గ్రామ పంచాయతీలతో మొదటి స్థానంలో ఉంది. పల్నాడు జిల్లాలో 72, ప్రకాశం జిల్లాలో 62, మార్కాపురం జిల్లాలో 49, వైఎస్సార్ కడప జిల్లాలో 49 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

    తిరుపతి జిల్లాలో 135 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం విశేషం.

    విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో ఎన్నికలు లేవు

    ఫేజ్-1లో విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో ఎన్నికలకు వెళ్లే గ్రామ పంచాయతీలు లేవని రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదికలో స్పష్టం చేసింది.

    మొత్తం ఎన్నికల గణాంకాలు:

    ఎన్నికలకు నోటిఫై చేసిన గ్రామ పంచాయతీలు – 3,949

    ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు – 758

    ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలు – 3,191

    పోటీలో ఉన్న మొత్తం అభ్యర్థులు – 9,052

    రెవెన్యూ డివిజన్లు – 42

    మండలాలు – 201

    మొత్తంగా ఫేజ్-1 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3,191 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవుల కోసం 9,052 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో అత్యధిక స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా, అన్నమయ్య జిల్లాలో అత్యధిక గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.