అహోబిలంలో భారీ అగ్నిప్రమాదం.. 6 దుకాణాలు దగ్ధం
రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుల అంచనా; గ్యాస్ సిలిండర్లు తొలగించడంతో పెను ముప్పు తప్పింది
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని దిగువ అహోబిలంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రధాన ఆలయానికి ఎదురుగా బీగల ఆంజనేయస్వామి గుడి మార్గంలో ఉన్న 6 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ప్రమాదంలో 3 బొమ్మల దుకాణాలు, 1 శీతల పానీయాల దుకాణం, 2 హోటళ్లు కాలిపోయాయి. బాధితుల అంచనా ప్రకారం రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. సమాచారం అందిన వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
HIGHLIGHTS
- ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఘటన
- 6 దుకాణాలు పూర్తిగా దగ్ధం
- రూ.50 లక్షలకు పైగా నష్టం అంచనా
- గ్యాస్ సిలిండర్లు తొలగించడంతో ప్రమాదం తప్పింది
సమీప హోటళ్లలోని గ్యాస్ సిలిండర్లను స్థానికులు, పోలీస్ సిబ్బంది సకాలంలో బయటకు తరలించడంతో పెద్ద ప్రమాదం నివారితమైందని స్థానికులు తెలిపారు. మంటలు ఎలా చెలరేగాయనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు నష్టం అంచనా, ప్రమాద కారణాలపై పరిశీలన కొనసాగిస్తున్నారు.
Also Read- విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తిపారవశ్యం! అమ్మవారికి 2 బంగారు పూలు సమర్పించిన మార్గదర్శి శైలజాకిరణ్!
