99TV News

    ఏపీకి తుపాను హెచ్చరిక | మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు

    ఏపీకి తుపాను హెచ్చరిక | మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు

    ఏపీకి తుపాను ముప్పు.. భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక

    ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న సుస్పష్టమైన అల్పపీడనం శనివారం రాత్రికి వాయుగుండంగా, ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

    సోమవారం ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారి, బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి చేరే అవకాశముందని వెల్లడించారు. దీని ప్రభావంతో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు, మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది.

    తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దని కోరారు. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ అధికారిక హెచ్చరికలను పాటించాలని తెలిపారు.

    అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.