న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక నిందితుడైన రాజ్ కెసిరెడ్డికి అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) పలు కీలక షరతులు విధించింది. ఈ కేసు పరిణామాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
బెయిల్‌లో జోక్యానికి నై.. షరతులు విధించిన అత్యున్నత న్యాయస్థానం
రాజ్ కెసిరెడ్డికి గతంలో హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు స్పష్టంగా నిరాకరించింది. అయితే, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని విచారణ పూర్తయ్యే వరకు ఆయన దేశం విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని ఆంక్షలు విధించింది. అలాగే అధికారుల దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ
విచారణ ప్రక్రియలో నిందితుడు ఒకవేళ అధికారులకు సరిగ్గా సహకరించకపోతే, అతని బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ మళ్లీ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Also Read - అర్నబ్ తుపాను హెచ్చరికలు: అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్!
రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
ఇదే కేసులో రాజ్ కెసిరెడ్డిని అరెస్టు చేసిన విధానం మరియు ఆయన ప్రొడక్షన్ వారెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిశీలించి కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూనే, నిందితుడి ప్రవర్తన మరియు దర్యాప్తు ప్రక్రియపై కఠిన నిబంధనలను అమలు చేయాలని తేల్చిచెప్పింది.
