జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ
2025 అవార్డుల ఎంపికకు ప్రత్యేక కమిటీ; సభ్యులుగా అల్లు అరవింద్, ఎస్.గోపాల్ రెడ్డి, ప్రభ నియామకం
2025 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసింది. హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణను ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. కమిటీలో నిర్మాత అల్లు అరవింద్, సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఎస్.గోపాల్ రెడ్డి, సీనియర్ నటి ప్రభ సభ్యులుగా ఉంటారు.
HIGHLIGHTS
- ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ
- సభ్యుడిగా అల్లు అరవింద్
- 2025 అవార్డుల ఎంపిక ప్రక్రియ
- ఉత్తర్వులు జారీ చేసిన ఎస్.సురేశ్ కుమార్
గవర్నర్ ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. జ్యూరీ నియామకానికి సంబంధించిన తదుపరి చర్యలను వేగవంతం చేయాలని విజయవాడలోని ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశించింది. తదుపరి ఎంపిక ప్రక్రియ షెడ్యూల్‌పై సంస్థ చర్యలు చేపట్టనుంది.
Also Read - బండ్ల గణేశ్ కు ఊరట.. రూ.95 లక్షల చెక్ బౌన్స్ కేసు పరిష్కారం
