బాపట్ల వేటపాలెంలో ఉద్రిక్తత.. గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు
రీపోలింగ్ డిమాండ్‌పై నిరసన మధ్య టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ; పలువురికి గాయాలు
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో స్థానిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొత్తరెడ్డిపాలెం ఓటర్ల ఓట్లను ఇతరులు వేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించడంతో నిరసన ప్రారంభమై, టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది.
కాంగ్రెస్ నేతలు రీపోలింగ్ కోరుతూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన తరువాత మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన వాహనంపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయని కాంగ్రెస్ వర్గాలు ఆరోపించాయి. అనంతరం ఇరువర్గాల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు జోక్యం చేసుకుని గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపి గుంపులను చెదరగొట్టారు.
HIGHLIGHTS
- వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో ఘర్షణ
- గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు
- రీపోలింగ్ కోరుతూ కాంగ్రెస్ ఫిర్యాదు
- గాయపడినవారు చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
పరస్పర దాడుల్లో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రం పరిసరాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఫిర్యాదులు, పోలింగ్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారి పరిశీలన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
