99TV News

    బంగాళాఖాతంలో అల్పపీడనం: వాయుగుండం చాన్స్

    అక్టోబరు 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. 15కు వాయుగుండం చాన్స్

    బంగాళాఖాతంలో అక్టోబరు 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం

    అక్టోబరు 15 నాటికి వాయుగుండంగా బలపడొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి

    బంగాళాఖాతంలో అక్టోబరు 13 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంపై అక్టోబరు 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడి, ఆ తర్వాత వాతావరణ వ్యవస్థ బలపడొచ్చని అధికారులు పేర్కొన్నారు.

    సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, అల్పపీడనం పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ అక్టోబరు 15 నాటికి దక్షిణ, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని గమనం, తీవ్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు చెప్పారు.

    HIGHLIGHTS

    - అక్టోబరు 12న ఉపరితల ఆవర్తనం

    - అక్టోబరు 13న అల్పపీడనం అవకాశం

    - అక్టోబరు 15న వాయుగుండం చాన్స్

    - ఏపీలో 34.9 శాతం వర్షపాతం లోటు

    నైరుతి రుతుపవనాల సీజన్‌లో జూన్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఏపీలో 589.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం స్థానంలో 383.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో రాష్ట్రంలో 34.9 శాతం లోటు ఏర్పడింది. రానున్న రోజుల్లో ఈ వ్యవస్థ ప్రభావంపై స్పష్టత రానుంది.