99TV News

    భీమిలిలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 200 కుటుంబాలు

    గంటా సమక్షంలో టీడీపీలోకి 200 కుటుంబాల చేరిక

    భీమిలిలో వైసీపీకి ఎదురుదెబ్బ, టీడీపీలోకి 200 కుటుంబాలు

    ఆనందపురం మండలం సొంఠ్యాం గ్రామానికి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు.

    విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో గురువారం వైసీపీకి రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఆనందపురం మండలం సొంఠ్యాం గ్రామానికి చెందిన సుమారు 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, “ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన, అభివృద్ధి పనులను చూసి ప్రజలు స్వచ్ఛందంగా కూటమిలో చేరుతున్నారు” అని అన్నారు. “ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఇవే చేరికలు నిదర్శనం” అని ఆయన పేర్కొన్నారు. “రాబోయే ఏ ఎన్నికల్లోనైనా కూటమిదే విజయం” అని గంటా ధీమా వ్యక్తం చేశారు.

    HIGHLIGHTS

    - భీమిలిలో టీడీపీలోకి 200 కుటుంబాలు

    - సొంఠ్యాం గ్రామం నుంచి చేరికలు

    - గంటా శ్రీనివాసరావు సమక్షంలో కార్యక్రమం

    ఇటీవల భీమిలి వైసీపీ సమన్వయకర్తగా బొత్స అనూష బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ చేరికలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. నియోజకవర్గంలో మరిన్ని చేరికలు కొనసాగుతాయని టీడీపీ నేతలు తెలిపారు.