99TV News

    Byra Dileep Chakravarthy Joins Jana Sena | Pawan Kalyan

    Byra Dileep Chakravarthy Joins Jana Sena | Pawan Kalyan

    జనసేనలో చేరిన ప్రజారాజ్యం మాజీ నేత బైరా దిలీప్‌ చక్రవర్తి

    ప్రజారాజ్యం పార్టీ మాజీ నాయకుడు, పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్‌ అధినేత బైరా దిలీప్‌ చక్రవర్తి తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బుధవారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ కండువా కప్పి దిలీప్‌ చక్రవర్తిని జనసేనలోకి ఆహ్వానించారు.

    నరసరావుపేట ప్రాంతానికి చెందిన దిలీప్‌ చక్రవర్తి గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. మెగా కుటుంబంతో ఆయనకు చాలాకాలంగా పరిచయాలు ఉన్నాయి. గతంలో జనసేనతో కలిసి పనిచేసిన ఆయన, వ్యాపార వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని నిర్ణయించుకుని జనసేనలో చేరారు.

    ఈ సందర్భంగా దిలీప్‌ చక్రవర్తి తాను రచించిన ‘లైఫ్‌ హ్యాక్స్‌’ పుస్తకాన్ని పవన్‌ కల్యాణ్‌కు బహూకరించారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై సమావేశమై చర్చించారు. ఆయన చేరికతో జనసేనలో తన రాజకీయ ప్రస్థానాన్ని తిరిగి ప్రారంభించారు.