99TV News

    స్థానిక ఎన్నికలు.. కూటమి నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు

    స్థానిక ఎన్నికలు.. కూటమి నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు

    స్థానిక ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం

    ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి ఐక్యతను కొనసాగించాలని సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించారు. సోమవారం ముఖ్య నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

    ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

    ‘చెప్పాం–చేస్తున్నాం’ ప్రచారం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మిత్రధర్మాన్ని పాటించాలని స్పష్టం చేశారు.

    పొత్తులు, రిజర్వేషన్ల కారణంగా పోటీ చేసే అవకాశం దక్కని పార్టీ నేతలకు నామినేటెడ్ పదవుల ద్వారా గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి వార్డు, డివిజన్‌లో కూటమి బలోపేతానికి కృషి చేయాలని, 2024 ఎన్నికల కంటే ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఎక్కువ ఓట్లు సాధించేలా పనిచేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.

    ఏపీ స్థానిక ఎన్నికలు — అభ్యర్థులు, పార్టీలు, జిల్లాల వివరాలు →