తెలంగాణలో చంద్రబాబు పర్యటన; పాల్వంచ ఆలయంలో ప్రత్యేక పూజలు
నవ లిమిటెడ్ ఆహ్వానంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చిన ఏపీ సీఎం దంపతులకు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురువారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించారు. నవ లిమిటెడ్ ఆహ్వానం మేరకు వచ్చిన ఆయన, సతీమణి నారా భువనేశ్వరితో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా అధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు. ఆలయ ప్రాంగణానికి భారీగా చేరుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులకు చంద్రబాబు చేతులెత్తి అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆయన నవ లిమిటెడ్ ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.
Also Read - నందమూరి బాలకృష్ణ జాతీయ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా నియామకం
