99TV News

    తిరుమల మాస్టర్ ప్లాన్: సేవ, వైద్యం, పర్యావరణంపై సీఎం ఫోకస్

    తిరుమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

    తిరుమల అభివృద్దికి సీఎం మాస్టర్ ప్లాన్ - ఆధ్యాత్మికతతో పాటు సేవ, వైద్యం, పర్యావరణంపై ఫోకస్!

    తిరుమల క్షేత్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక, సేవా కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను

    కాపాడుతూనే, భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడం, సమాజ సేవను దైవ సేవతో అనుసంధానించడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (టీటీడీ) కొత్త పుంతలు తొక్కించేందుకు ఒక

    సమగ్ర, దీర్ఘకాలిక ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. తన తిరుమల పర్యటనలో భాగంగా రెండో రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా

    సమావేశంలో, టీటీడీ భవిష్యత్ కార్యాచరణపై ఆయన సుదీర్ఘంగా వివరించారు.

    తిరుమలలో తన పర్యటన రెండో రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. టీటీడీ భవిష్యత్ కార్యాచరణపై తన ఆలోచనలను వివరించారు.

    “మానవ సేవే మాధవ సేవ”

    తిరుమలలో భక్తులకు సేవ చేయడం మాత్రమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను మరింత విస్తరించాలన్నది తన ఆలోచనగా చంద్రబాబు చెప్పారు.

    అన్నదానం, ప్రాణదానం, శ్రీవారి సేవ, విద్యాదానం, దేవాలయ నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ అనే ఆరు ప్రధాన అంశాల చుట్టూ టీటీడీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని

    ప్రతిపాదించారు.

    అన్నదానానికి భారీ కార్పస్

    ఎన్టీ రామారావు ప్రారంభించిన అన్నదాన కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తామని చంద్రబాబు తెలిపారు. రూ.3,168 కోట్ల కార్పస్ ఫండ్ ద్వారా భవిష్యత్తులోనూ అన్నప్రసాద కార్యక్రమం

    నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల సూచన మేరకు అన్నప్రసాదంలో మజ్జిగకు బదులుగా పెరుగు అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

    తిరుపతిని మెడికల్ హబ్‌గా మార్చే ప్రణాళిక

    తిరుపతిలో ఇప్పటికే ఉన్న వైద్య సంస్థలను ఒకే వ్యవస్థ కిందకు తీసుకొచ్చి పెద్ద వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు చెప్పారు. స్విమ్స్, బర్డ్, రుయా, చిన్నపిల్లల ఆసుపత్రి,

    కార్డియాలజీ, టాటా క్యాన్సర్ ఆసుపత్రి, అరవింద్ కంటి ఆసుపత్రి తదితర సంస్థల సేవలను సమన్వయం చేసేందుకు అపెక్స్ బాడీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న

    800 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్న శ్రీవారి వైద్య సేవకుల సేవలను కూడా దీనికి అనుసంధానం చేస్తామని తెలిపారు.

    12 లక్షల మంది శ్రీవారి సేవకులకు కొత్త బాధ్యతలు

    ఇప్పటికే సుమారు 12 లక్షల మంది శ్రీవారి సేవకులు నమోదు చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. వీరికి ఉన్నతస్థాయి శిక్షణ ఇచ్చి వైద్యం, విద్య, సాంస్కృతిక రంగాలతో పాటు సామాజిక

    సేవల్లోనూ వారి నైపుణ్యాలను ఉపయోగించుకుంటామని చంద్రబాబు చెప్పారు.