99TV News

    విజయవాడ ఉత్సవం 2026కు చైనా రాయబారి.. చంద్రబాబుతో భేటీ

    విజయవాడ ఉత్సవం 2026కు చైనా రాయబారి.. చంద్రబాబుతో భేటీ

    విజయవాడ ఉత్సవాలకు చైనా రాయబారి జూ ఫీహోంగ్.. చంద్రబాబుతో భేటీ

    విజయవాడ ఉత్సవం 2026కు చైనా రాయబారి జూ ఫీహోంగ్ హాజరుకానున్నారు. అక్టోబర్ 16 నుంచి 18 వరకు ఆయన తన భార్య టాన్ యుక్సియుతో కలిసి విజయవాడలో పర్యటించనున్నారు. ఈ ఉత్సవాలకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాయబారి కృతజ్ఞతలు తెలిపారు.

    భారత్, చైనా దేశాలకు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందని జూ ఫీహోంగ్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య పరస్పర ఆదానప్రదానాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

    పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ కానున్నారు. భారత్‌-చైనా మధ్య సహకారాన్ని పెంపొందించే అవకాశాలపై చర్చించే అవకాశం ఉంది. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.