అర్ణబ్ తుపాను ప్రభావం.. ఉప్పాడ తీరంలో కోత, బీచ్ రోడ్డుపైకి రాళ్లు
ఆంధ్రప్రదేశ్‌పై అర్ణబ్ తుపాను ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఎగిసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్రపు అలల ధాటికి తీరం కోతకు గురైంది. ఇటీవల ఎత్తుగా నిర్మించిన రాళ్లగట్టును సైతం అలలు దాటి రావడంతో బీచ్ రోడ్డుపైకి రాళ్లు చేరాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Also Read- తీవ్ర తుపానుగా ‘అర్ణబ్’.. ఏపీ తీరానికి ముప్పు హెచ్చరిక
ఉత్తరాంధ్రలో వర్షాలు
మరోవైపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం నమోదైంది. కవిటి, కంచిలి, సోంపేట, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, గార, లావేరు, ఆమదాలవలస ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.
భీమిలి తీరంలో ఉద్ధృతంగా అలలు
విశాఖపట్నం జిల్లా భీమిలి తీరంలోనూ సముద్రపు అలలు బలంగా ఎగిసిపడుతున్నాయి. తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలు బీచ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాలి. సముద్రంలోకి వెళ్లకుండా, అధికారుల సూచనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు.
