రేపే రెండో విడత పంచాయతీ పోలింగ్; లోకేశ్ టెలీకాన్ఫరెన్స్
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని పార్టీ ముఖ్యనేతలకు తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో నవంబరు 29న జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ శనివారం పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల వ్యూహాలపై సూచనలు చేశారు.
కూటమి బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు పూర్తి అంకితభావంతో పనిచేయాలని లోకేశ్ కోరారు. ప్రతి ఓటూ కీలకమని, బూత్ స్థాయి నుంచే పకడ్బందీ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. రెబల్స్ సమస్యలు ఉంటే స్థానిక నాయకత్వంతో వెంటనే పరిష్కరించుకోవాలని చెప్పారు.
HIGHLIGHTS
- నవంబరు 29న రెండో విడత పోలింగ్
- ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఓటింగ్
- 3,803 స్థానాలకు పోలింగ్
- 1,171 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం
పార్టీ శ్రేణులు కూటమి భాగస్వామ్య పార్టీలతో సమన్వయం కొనసాగించి ఓట్ల బదిలీ 100 శాతం జరిగేలా చూడాలని లోకేశ్ స్పష్టం చేశారు. “మొదటి విడతకంటే మెరుగైన ఫలితాలు సాధించాలి” అని టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన అన్నారు. కష్టపడి పనిచేసిన వారికి భవిష్యత్తులో సముచిత స్థానం, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
