99TV News

    రాప్తాడు బాలిక ఆరోగ్యంపై నారా లోకేశ్ అప్డేట్.. ప్లాస్టిక్ సర్జరీ సక్సెస్

    రాప్తాడు బాలిక ఆరోగ్యంపై నారా లోకేశ్ అప్డేట్.. ప్లాస్టిక్ సర్జరీ సక్సెస్

    ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రాప్తాడు బాలికపై దాడి ఘటనలో బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ కీలక అప్డేట్ ఇచ్చారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికకు నిర్వహించిన ప్లాస్టిక్ సర్జరీ విజయవంతమైందని వెల్లడించారు. ప్రస్తుతం బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, క్రమంగా కోలుకుంటోందని తెలిపారు.

    వైద్యులు బాలికకు సంబంధించిన గాయాలకు డీబ్రిడ్‌మెంట్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు లోకేశ్ పేర్కొన్నారు. గాయాలను శుభ్రపరచడంతో పాటు కుట్లకు సంబంధించిన చికిత్సను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినట్లు వివరించారు. ప్రస్తుతం గాయాలు క్రమంగా నయమవుతున్నాయని తెలిపారు.

    Highlights

    - రాప్తాడు బాలిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ కీలక అప్డేట్.

    - బాలికకు నిర్వహించిన ప్లాస్టిక్ సర్జరీ విజయవంతం.

    - బెంగళూరులోని ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స.

    - గాయాలు క్రమంగా నయమవుతున్నాయని వెల్లడి.

    - ఎడమ చేతి స్లింగ్ తొలగించడంతో చేతిని కదుపుతున్న బాలిక.

    - నొప్పి నివారణ మందులు, ఫీడింగ్ సపోర్ట్ అందిస్తున్న వైద్యులు.

    - త్వరలోనే PICU నుంచి జనరల్ వార్డుకు తరలించే అవకాశం.

    మరోవైపు, బాలిక ఎడమ చేతికి వేసిన స్లింగ్‌ను వైద్యులు తొలగించడంతో ఆమె నెమ్మదిగా చేతిని కదిలించగలుగుతోందని మంత్రి వెల్లడించారు. తీవ్ర గాయాల నుంచి కోలుకుంటున్నప్పటికీ ఆ చిన్నారి ఎంతో ధైర్యంగా చికిత్సకు సహకరిస్తోందని ప్రశంసించారు.

    ప్రస్తుతం బాధితురాలికి నొప్పి నివారణ మందులతో పాటు అవసరమైన ఫీడింగ్ సపోర్ట్ అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇదే విధంగా మెరుగుపడితే త్వరలోనే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU) నుంచి సాధారణ వార్డుకు తరలించే అవకాశం ఉందని లోకేశ్ తెలిపారు.

    కాగా, రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ చైన్‌సాతో దాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు మంత్రి వెల్లడించడంతో కుటుంబ సభ్యులు, ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

    Also Raed- టైరు పేలి క్షణాల్లో బస్సుకు మంటలు.. 33 మంది ప్రయాణికులు సురక్షితం!