మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత
అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస; రాజకీయ, పారిశ్రామిక, విద్యా రంగాల్లో గుర్తింపు
మాజీ ఎంపీ, TDP సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు(83) ఇవాళ కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గతంలో ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆయనకు వ్యాధి మళ్లీ తిరగబెట్టినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.
రాజకీయాలతో పాటు ఇండస్ట్రియలిస్ట్గా, విద్యావేత్తగా రాయపాటి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అంత్యక్రియల వివరాలను కుటుంబ సభ్యులు త్వరలో ప్రకటించనున్నారు.
