99TV News

    వివేకా హత్య కేసు: ED విచారణకు శివశంకర్ రెడ్డి

    వివేకా హత్య కేసులో ED విచారణకు హాజరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి

    వివేకా హత్య కేసులో ఈడీ విచారణకు శివశంకర్ రెడ్డి హాజరు

    మనీలాండరింగ్ కోణంలో ఆర్థిక లావాదేవీలపై హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో అధికారుల ప్రశ్నలు

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A-5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.

    సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. హత్య వెనుక రూ.40 కోట్ల సుపారీ లావాదేవీ జరిగిందని సీబీఐ చార్జ్‌షీట్‌లో ఆరోపించింది. ఆర్థిక మూలాలు, నిధుల సమీకరణ, లావాదేవీల మార్గాలపై ఈడీ దృష్టి సారించింది. ఈ కుట్రలో శివశంకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, నిధులు సమకూర్చుతానని హామీ ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.

    HIGHLIGHTS

    - శివశంకర్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు

    - కేసులో ఆయన A-5గా ఉన్నారు

    - రూ.40 కోట్ల సుపారీ ఆరోపణ

    - అక్టోబర్ 14న అవినాశ్ రెడ్డి విచారణ

    ఈ కేసులో గత ఆగస్టులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. అదే కేసులో విచారణకు రావాలని అవినాశ్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన అక్టోబర్ 14న విచారణకు హాజరుకానున్నారు.