99TV News

    ఏపీలో గ్రామాల విలీనం.. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు

    ఏపీలో గ్రామాల విలీనం.. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు

    ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు నోటీసులు.. ప్రభుత్వానికి వివరణ కోరిన ధర్మాసనం

    ఆంధ్రప్రదేశ్‌లో సమీప గ్రామాలను మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేసే ప్రక్రియపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గ్రామాల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం, ఈ ప్రక్రియ తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

    జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. గ్రామాల తీర్మానాలు, ఆమోదం తీసుకోకుండానే విలీనం చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. చట్టపరమైన నిబంధనలు పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

    రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రామకృష్ణ ప్రసాద్ వాదించారు.

    పొన్నూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కందుకూరు, భీమవరం, గూడూరు, గుడివాడ మున్సిపాలిటీలతో పాటు శ్రీకాకుళం, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. రాజానగరం ప్రాంతం అప్‌గ్రేడేషన్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. గ్రామాల అభిప్రాయాలు, చట్టపరమైన ప్రక్రియ పాటించారా అనే అంశాలపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం కీలకం కానుంది.