ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడైన తాజా ట్రెండ్స్‌లో అధికార కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు భారీ సంఖ్యలో విజయాలు సాధించడంతో పాటు మరికొన్ని స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం వెనుకంజలో కనిపిస్తోంది.
జడ్పీటీసీ ఫలితాల్లో కూటమి ఆధిక్యం
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఇప్పటివరకు 140 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ వెల్లడయ్యాయి. ఇందులో కూటమి 78 స్థానాల్లో విజయం సాధించగా, మరో 54 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ ఒక స్థానంలో గెలుపొందగా, మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు వెల్లడైన లెక్కల ప్రకారం ఇతరులు ఖాతా తెరవలేదు.
Highlights
- ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగింపు.
- ఇప్పటివరకు వెల్లడైన ట్రెండ్స్‌లో కూటమి స్పష్టమైన ఆధిక్యం.
- జడ్పీటీసీలో 78 స్థానాలు గెలుచుకున్న కూటమి.
- మరో 54 జడ్పీటీసీ స్థానాల్లో ఆధిక్యంలో కూటమి.
- వైసీపీ ఇప్పటివరకు ఒక జడ్పీటీసీ స్థానంలో విజయం.
- ఎంపీటీసీల్లో 1,918 స్థానాలను గెలుచుకున్న కూటమి.
- ఎంపీటీసీల్లో వైసీపీకి 87 స్థానాలు, ఇతరులకు 32 స్థానాలు.
- సాయంత్రంలోగా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం.
ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి జోరు
ఎంపీటీసీ ఫలితాల్లోనూ కూటమి అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. మొత్తం 9,821 స్థానాలకు గాను ఇప్పటివరకు 2,037 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో కూటమి 1,918 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ 87 స్థానాలను గెలుచుకోగా, ఇతరులు 32 స్థానాల్లో విజయం సాధించారు.
సాయంత్రంలోగా పూర్తి ఫలితాలు!
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 365 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రక్రియను సాయంత్రం 8 గంటల్లోగా పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో లెక్కింపు కొనసాగుతోంది. సాయంత్రంలోగా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజా ఫలితాల వివరాలు
జడ్పీటీసీ (140 / 659)
పార్టీ గెలుపు ఆధిక్యం
కూటమి 78 54
వైసీపీ 1 7
ఇతరులు 0 0
ఎంపీటీసీ (2,037 / 9,821)
పార్టీ గెలుపు
కూటమి 1,918
వైసీపీ 87
ఇతరులు 32
Also Read- కౌంటింగ్‌కు ఒక్కరోజు ముందు తీరని విషాదం.. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి దివ్య కన్నుమూత!
