ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం
ఈనెల 23 వరకు దరఖాస్తుల స్వీకరణ; నవంబర్ 3న పోలింగ్, 5న ఫలితాలు
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఈనెల 23లోగా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు ఈనెల 27 తుది గడువు. అనంతరం బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు.
HIGHLIGHTS
- నామినేషన్ల స్వీకరణ ఈనెల 23 వరకు
- పరిశీలన ఈనెల 24న
- ఉపసంహరణ గడువు ఈనెల 27
- పోలింగ్ నవంబర్ 3న
- ఫలితాలు నవంబర్ 5న
ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ నవంబర్ 3న జరగనుండగా, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
Also Read- పల్నాడు జిల్లాలో వైకాపా నేతల గృహనిర్బంధం.. నామినేషన్ల వేళ పోలీస్ చర్యలు
