ఆంధ్రప్రదేశ్లో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సాధించిన విజయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంపై చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు పలికారని పేర్కొన్నారు. విధ్వంసాలు, కుట్రలతో కూడిన తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించరని ఎన్నికల తీర్పుతో స్పష్టమైందని వ్యాఖ్యానించారు.
Highlights
- స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై పల్లా శ్రీనివాసరావు హర్షం.
- అమరావతిలో సీఎం చంద్రబాబుతో పల్లా భేటీ.
- అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు పలికారని వ్యాఖ్య.
- కూటమి నాయకులు, కార్యకర్తలు, విజేతలకు అభినందనలు.
- ఎన్నికల ఫలితాలు మరింత బాధ్యతను పెంచాయని వెల్లడి.
కూటమి విజయం కోసం కృషి చేసిన మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు, ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు పల్లా అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు తమపై మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు. ఇకపై మరింత వినయంతో, అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పాన్ని ఈ విజయం కలిగించిందని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
Also Read- ఏబీ వెంకటేశ్వరరావుకు విజయవాడ మేయర్ ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు
