99TV News

    పల్నాడు YSRCP నేతల హౌస్ అరెస్ట్ | Local Body Elections

    పల్నాడు జిల్లాలో YSRCP నేతల గృహనిర్బంధం.. నామినేషన్ల వేళ పోలీస్ చర్యలు

    పల్నాడులో వైకాపా నేతలు గృహనిర్బంధం

    ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు నివారించేందుకు పోలీసుల ముందస్తు చర్యలు

    పల్నాడు జిల్లాలో బుధవారం పలుచోట్ల వైకాపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. స్థానిక సంస్థల పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.

    పిడుగురాళ్లలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో వైకాపా పల్నాడు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డితో పాటు రొంపిచర్ల మండలానికి చెందిన మాజీ సర్పంచ్‌లు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    HIGHLIGHTS

    - పల్నాడు జిల్లాలో పలుచోట్ల హౌస్ అరెస్టులు

    - కాసు మహేశ్‌రెడ్డి, పిన్నెల్లి గృహనిర్బంధం

    - నామినేషన్ల నేపథ్యంలో పోలీసు పహారా

    పలువురు నేతల ఇళ్ల వద్ద పోలీస్ పహారా కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు పరిస్థితిని సమీక్షించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

    ఏపీ స్థానిక ఎన్నికలు — అభ్యర్థులు, పార్టీలు, జిల్లాల వివరాలు →