99TV News

    పులివెందుల మున్సిపల్ ఎన్నికల గ్రౌండ్ రిపోర్ట్ | Pulivendula Municipality Elections Grou...

    పులివెందుల మున్సిపల్ ఎన్నికల గ్రౌండ్ రిపోర్ట్ | Pulivendula Municipality Elections Grou...

    ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో పులివెందుల మున్సిపాలిటీ పోరు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వైఎస్ఆర్‌సీపీకి కష్టకాలంలోనూ అండగా నిలిచిన ఈ నియోజకవర్గంలో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

    1. వార్డులు - ఓటర్ల వివరాలు (Ward & Voter Details)పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులు ఉన్నాయి. నియోజకవర్గంలో మహిళా ఓటర్ల ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. మొత్తం వార్డులు: 40 మొత్తం ఓటర్లు: 46,200 పురుష ఓటర్లు: 22,900 మహిళా ఓటర్లు: 23,300

    2. ప్రధాన పోటీదారులు (Key Candidates)పులివెందుల మున్సిపల్ పీఠం కోసం ఇరు వర్గాలు బలమైన మహిళా అభ్యర్థులను బరిలోకి దించాయి. అభ్యర్థి (TDP-JSP-BJP): తూగుట్ల గీతాకుమారి

    వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి: వైఎస్ ప్రమీలమ్మ

    3. అభ్యర్థుల బలాబలాలు (Strengths & Weaknesses)

    కూటమి అభ్యర్థి: తూగుట్ల గీతాకుమారి

    బలాలు (Strengths):రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అండ ఉండటం అతిపెద్ద ప్లస్ పాయింట్. స్థానిక నెట్‌వర్క్ బలంగా ఉండటం మరియు ఆమె భర్త తూగుట్ల మధుతో కలిసి మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ గ్రౌండ్ లెవల్‌లో చురుగ్గా ప్రచారం చేయడం.

    బలహీనతలు (Weaknesses):ప్రత్యర్థి కుటుంబానికి పులివెందులలో దశాబ్దాలుగా ఉన్న గట్టి పట్టు. వ్యక్తిగత చరిష్మా లోటు మరియు వైఎస్ ఫ్యామిలీ బ్రాండ్ ఇమేజ్‌ను ఒంటరిగా ఎదుర్కోవడంలో వ్యక్తిగత ఇమేజ్ పరంగా కొంత డౌన్‌లో ఉండటం.

    వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి: వైఎస్ ప్రమీలమ్మ

    బలాలు (Strengths):వైఎస్ ఫ్యామిలీ ట్యాగ్ ఉండటం. మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నమ్మగా, 'వైఎస్' అనే కుటుంబ బ్రాండ్ నేమ్ పులివెందులలో అత్యంత కీలకమైన బలం. వైఎస్‌ఆర్‌సీపీకి పులివెందుల సొంత గడ్డ కావడం మరియు సాంప్రదాయ ఓటు బ్యాంక్ బలంగా ఉండటం.

    బలహీనతలు (Weaknesses):ఎన్నికల ప్రచారంలో ఆమె బౌన్సర్ల రక్షణ మధ్య తిరగడంపై విమర్శలు రావడం, స్థానిక ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి ఇది కొంత అవరోధంగా మారడం. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రతిపక్షంలో ఉండటం మరియు అధికార కూటమి దాకుడుగా వ్యూహాలు రచించడం మైనస్ పాయింట్.

    4. విజయ అవకాశాలు - రాజకీయ సమీకరణాలు (Political Scenarios)2021 పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ మొత్తం 33 వార్డులనూ ఏకగ్రీవంగా గెలుచుకుంది. అయితే, 2026 నాటికి వార్డుల సంఖ్య 40కి పెరిగింది. గతంలో జగన్ హయాంలో కుప్పం మున్సిపాలిటీలో వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేసినట్లే.. ఇప్పుడు పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేసి ప్రతికారం తీర్చుకోవాలని అధికార కూటమి భావిస్తోంది. ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ కోటను కాపాడుకుంటుందా లేక కూటమి బోణీ కొడుతుందా అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.

    ఏపీ స్థానిక ఎన్నికలు — అభ్యర్థులు, పార్టీలు, జిల్లాల వివరాలు →