విజయవాడ నగర మేయర్‌గా జనసేన నేత, కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో తన విజయంపై వంగవీటి రాధా స్పందించారు.
తనకు మేయర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు రాధా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తన ఒక్కడిదే కాదని, విజయవాడ ప్రజలందరి విజయమని పేర్కొన్నారు. తనపై నగర ప్రజలు చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.
Highlights
- విజయవాడ మేయర్‌గా జనసేన నేత వంగవీటి రాధాకృష్ణ విజయం.
- వైసీపీ అభ్యర్థి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిపై భారీ ఆధిక్యం.
- అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు.
- ఈ విజయం విజయవాడ ప్రజలందరిదని రాధా వ్యాఖ్య.
- నగర అభివృద్ధికి అందరినీ కలుపుకుని పనిచేస్తానని హామీ.
తన విజయానికి ఎంపీ కేశినేని చిన్నితో పాటు స్థానిక కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారని రాధా గుర్తు చేసుకున్నారు. అందరినీ కలుపుకుని విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
Also Read- విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా విజయం.. చరిత్రాత్మకమంటూ కేశినేని చిన్ని వ్యాఖ్యలు!
