99TV News

    హోండా ఎలివేట్ Facelift: 360 కెమెరా, Level-2 ADAS

    హోండా ఎలివేట్ Facelift విడుదల.. 360 కెమెరా, Level-2 ADAS అప్‌డేట్స్

    హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ భారత్‌లో విడుదల

    రూ.11.80 లక్షల ప్రారంభ ధరతో 360 డిగ్రీ కెమెరా, లెవల్-2 ఏడీఏఎస్‌ సహా కొత్త ఫీచర్లు జోడింపు

    హోండా కార్స్ ఇండియా తన ఎలివేట్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. రూ.11.80 లక్షల ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధరతో వచ్చిన ఈ మోడల్‌లో డిజైన్ మార్పులు, 360 డిగ్రీ కెమెరా, లెవల్-2 ఏడీఏఎస్‌ వంటి అప్‌డేట్స్‌ను కంపెనీ అందించింది.

    కొత్త ఎలివేట్‌లో ముందు భాగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. హెడ్‌ల్యాంప్‌లను కలుపుతూ ఎల్‌ఈడీ లైట్ స్ట్రిప్, హనీ కోంబ్ డిజైన్ గ్రిల్‌ను జోడించారు. వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్‌ ప్రధాన మార్పుగా నిలిచాయి. అయితే ఎస్‌యూవీ మొత్తం ఆకారం దాదాపు పాత మోడల్‌లానే కొనసాగింది.

    ఫీచర్ల పరంగా ముందు సీట్లకు వెంటిలేషన్, 8-వే పవర్ డ్రైవర్ సీట్, వెనుక వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, లేన్ వాచ్ కెమెరా, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సీవీటీ వేరియంట్లలో వెనుక డిస్క్ బ్రేకులు ఇచ్చారు.

    HIGHLIGHTS

    - ప్రారంభ ధర రూ.11.80 లక్షలు

    - 360 డిగ్రీ కెమెరా జోడింపు

    - లెవల్-2 ఏడీఏఎస్‌ ఫీచర్

    - 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగింపు

    ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఈ ఇంజిన్ 119 హెచ్‌పీ పవర్, 145 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. ఎస్‌వీ, వీ, వీఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్+ వేరియంట్లలో ఈ ఎస్‌యూవీ లభిస్తుంది.

    నార్డిక్ ఫారెస్ట్ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, మెటియరాయిడ్ గ్రే మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్ రంగుల్లో కొనుగోలుదారులకు ఎంపికలు అందించారు. కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ బుకింగ్స్, డెలివరీలపై మరిన్ని వివరాలు డీలర్‌షిప్‌ల ద్వారా వెల్లడికానున్నాయి.