గ్లోబల్ ఎకానమీలో భారత్‌కు తొలి ర్యాంకు
2026-30 ఆర్థిక నిలకడ అంచనాల్లో 71 స్కోరుతో భారత్ అగ్రస్థానం; చైనా, అమెరికా వెనుకంజ
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య 2026-30 కాలానికి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అత్యధిక ఎకనామిక్ రెసిలియన్స్ కలిగిన దేశంగా నిలిచింది. అసోచామ్, ఐఎంఎఫ్ గణాంకాల ఆధారంగా ఇన్ఫోఇన్‌డేటా విడుదల చేసిన అంచనాల్లో భారత్ 100కి 71 స్కోరుతో తొలి స్థానాన్ని సాధించింది.
ఈ ర్యాంకింగ్స్‌లో చైనా 66 స్కోరుతో రెండో స్థానంలో నిలవగా, జపాన్, రష్యా 60 స్కోరుతో మూడో స్థానాన్ని పంచుకున్నాయి. జర్మనీకి 59, ఇటలీ, బ్రెజిల్‌కు 53 చొప్పున, బ్రిటన్‌కు 52, ఫ్రాన్స్‌కు 40 స్కోరు నమోదైంది. అమెరికా 36 స్కోరుతో చివర్లో నిలవడం గమనార్హం. బాహ్య ఆర్థిక షాక్‌లను తట్టుకునే సామర్థ్యం భారత్‌లో మెరుగుపడుతోందని ఇన్ఫోఇన్‌డేటా తెలిపింది.
రియల్ జీడీపీ గ్రోత్, తలసరి జీడీపీ వృద్ధి, గ్రాస్ సేవింగ్స్ విభాగాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్, ఎగుమతుల వృద్ధిలో రెండో ర్యాంకు, డెట్-టు-జీడీపీ నిష్పత్తిలో మూడో స్థానం సాధించింది. బలమైన దేశీయ డిమాండ్, ఎగుమతుల పెరుగుదల, స్థిరమైన పెట్టుబడి ప్రవాహాలు ఈ పనితీరుకు ఆధారంగా నిలిచాయి.
HIGHLIGHTS
- భారత్‌కు 100కి 71 స్కోరు
- చైనా 66 స్కోరుతో రెండో స్థానం
- అమెరికా 36 స్కోరుతో చివర్లో
- రియల్ జీడీపీ గ్రోత్‌లో భారత్ నంబర్ 1
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబరులో విడుదల చేసిన అంచనాల్లో దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమైన స్థూల మూలాలపై నిలిచిందని పేర్కొంది. విధానపరమైన చర్యలు అంతర్జాతీయ సవాళ్ల ప్రభావాన్ని తగ్గించాయని ఆర్‌బీఐ తెలిపింది. 2026-27 మొదటి అర్ధభాగంలో వాణిజ్య ఎగుమతులు రెండంకెల వృద్ధి నమోదు చేయడంతో వాణిజ్య లోటు తగ్గింది.
ఎఫ్‌డీఐ, ఈసీబీలు, రెమిటెన్స్‌లు ఆగస్టులో మెరుగుపడ్డాయని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. ఐఎంఎఫ్ కూడా భారత వృద్ధి అంచనాను 60 బేసిస్ పాయింట్లు పెంచి 7 శాతానికి సవరించింది. రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం, ప్రపంచ వాణిజ్య పరిస్థితులు, మూలధన ప్రవాహాలు ఈ నిలకడను పరీక్షించే కీలక అంశాలుగా ఉండనున్నాయి.
Also Read -స్టార్‌లింక్‌కు పోటీగా రిలయన్స్ ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళిక
