99TV News

    ఎస్బీఐ సైబర్ దాడి: 3,897 మంది డాటా లీక్

    ఎస్బీఐపై సైబర్ దాడి.. 3,897 మంది కస్టమర్ల డాటా లీక్

    ఎస్బీఐ కస్టమర్ల డేటా లీక్‌పై విచారణ ప్రారంభం

    డార్క్ వెబ్‌లో 3,897 మంది వివరాలు కనిపించాయని ఎస్బీఐ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల వ్యక్తిగత సమాచార లీక్‌పై ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రొసీజర్‌ను యాక్టివేట్ చేసింది. డార్క్ వెబ్‌లో గుర్తించిన 3.75 లక్షల రికార్డులను పరిశీలించగా 3,897 మంది కస్టమర్ల వివరాలు ఉన్నట్లు బ్యాంక్ బుధవారం స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.

    లీక్ అయిన సమాచారంలో పేర్లు, జెండర్, మొబైల్ నంబర్లు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, బ్రాంచ్, సీఐఎఫ్, ఐడీ, మెటాడేటా, లోన్ వివరాలు ఉన్నాయని ఎస్బీఐ తెలిపింది. అయితే బ్యాంక్ ఆర్థిక లావాదేవీలు, వ్యాపార నిర్వహణ, ఆర్థిక స్థితిపై ప్రభావం లేదని స్పష్టం చేసింది.

    “డేటా లీక్ సమాచారంపై సమగ్ర విచారణ కొనసాగుతోంది; లావాదేవీలు సాధారణంగా కొనసాగుతాయి” అని ఎస్బీఐ తన స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. “డేటా బయటపడినంత మాత్రాన ప్రతి ఖాతా హ్యాక్ అయినట్లు కాదు” అని బ్యాంక్ పేర్కొంది. “ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరికీ వెల్లడించరాదు” అని ఎస్బీఐ కస్టమర్లను అప్రమత్తం చేసింది.

    HIGHLIGHTS

    - 3,897 మంది కస్టమర్ల వివరాలు గుర్తింపు

    - 3.75 లక్షల రికార్డుల పరిశీలన

    - సెర్ట్-ఇన్ నుంచి సమాచారం

    - లావాదేవీలపై ప్రభావం లేదని బ్యాంక్ స్పష్టం

    థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, సెర్ట్-ఇన్ నుంచి సమాచారం అందినట్లు ఎస్బీఐ తెలిపింది. లీక్ అయిన వివరాలతో మోసగాళ్లు బ్యాంక్ సిబ్బంది పేరుతో కాల్స్ చేయవచ్చని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఖాతాదారులు అధికారిక ఎస్బీఐ వెబ్‌సైట్, యాప్‌లను మాత్రమే ఉపయోగించాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దని బ్యాంక్ సూచించింది. ట్రాన్సాక్షన్ అలర్ట్స్ ఎనేబుల్ చేసుకోవడం, లోన్ అకౌంట్లు, క్రెడిట్ కార్డు ఎంక్వైరీలను పర్యవేక్షించడం, బయోమెట్రిక్ లాక్ ఉపయోగించడం మంచిదని పేర్కొంది. విచారణ పూర్తయ్యాక తదుపరి చర్యలు ప్రకటించనుంది.