99TV News

    Daily Current Affairs 8 September 2026

    Daily Current Affairs 8 September 2026

    Daily Current Affairs – 8 సెప్టెంబర్ 2026 UPSC | APPSC | TGPSC | SSC | Banking | Railways | Defence తదితర పోటీ పరీక్షలకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్

    · మహారాష్ట్రలో కొత్త ఉభయచర జాతి – గెజినేఒఫీస్ చందగాడి: శాస్త్రవేత్తలు మహారాష్ట్రలో భూగర్భంలో నివసించే, కాళ్లు లేని కొత్త ఉభయచర జాతిని గెజినేఒఫీస్ చందగాడిగా గుర్తించారు. పశ్చిమ కనుమలు (Western Ghats)లో ఇప్పటికీ పూర్తిగా వెలుగులోకి రాని సమృద్ధమైన జీవవైవిధ్యానికి ఈ ఆవిష్కరణ మరో ఉదాహరణగా నిలిచింది.

    · స్వచ్ఛ్ వాయు సర్వేక్షన్ 2026లో లక్నో అగ్రస్థానం: వాయు కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యల ఆధారంగా నిర్వహించిన స్వచ్ఛ్ వాయు సర్వేక్షన్ 2026లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో లక్నో మొదటి స్థానంలో నిలిచింది. ఇండోర్ రెండో, జబల్పూర్ మూడో స్థానాలు సాధించాయి. రహదారి దుమ్ము, నిర్మాణ వ్యర్థాలు, వాహనాలు, పారిశ్రామిక కాలుష్యం వంటి ప్రధాన కాలుష్య వనరుల నియంత్రణకు నగరాలు తీసుకున్న చర్యలను ఈ వార్షిక సర్వే అంచనా వేస్తుంది.

    · NITI Aayog – PACT, ZET Marketplace: న్యూఢిల్లీలో సెప్టెంబర్ 7, 2026న జరిగిన 5th e-FAST India Summitలో NITI Aayog రెండు కీలక కార్యక్రమాలను ప్రారంభించింది. అవి Platform for Aggregating Clean Transport (PACT) మరియు Zero Emission Truck (ZET) Marketplace. Zero-emission freight వాహనాల వినియోగం, electric trucks స్వీకరణ, charging infrastructure ప్రణాళిక, manufacturers, logistics service providers, charging operators, financiers మధ్య వ్యాపార సహకారాన్ని పెంచడం వీటి లక్ష్యం.

    · ICICI Lombardపై ₹1 కోటి జరిమానా: Insurance Regulatory and Development Authority of India (IRDAI) సెప్టెంబర్ 7, 2026న ICICI Lombard General Insurance Company Limitedపై ₹1 కోటి జరిమానా విధించింది. outsourcing, vendor management, corporate governanceకు సంబంధించిన regulatory lapses కారణంగా ఈ చర్య తీసుకుంది. 2019 సెప్టెంబర్‌లో ప్రారంభమైన onsite inspection అనంతరం 2024 జూలై 8, డిసెంబర్ 17న show-cause notices జారీ అయ్యాయి.

    · 72వ National Film Awards: 72వ National Film Awards ప్రదానోత్సవం సెప్టెంబర్ 22, 2026న గుజరాత్‌లోని Narmada district, Ekta Nagarలో ఉన్న Statue of Unity ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 92 మంది విజేతలను సత్కరించనున్నారు.

    · భారత్ తొలి indigenous Optical Inter-Satellite Link: భారత deep-tech startup Astrogate Labs దేశంలోనే తొలిసారిగా indigenous Optical Inter-Satellite Link (OISL) terminalను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. ఉపగ్రహాల మధ్య నేరుగా laser communication ద్వారా డేటా మార్పిడి చేయడం ఈ వ్యవస్థ లక్ష్యం. ఇది space-to-ground optical links నుంచి in-orbit satellite connectivity వైపు కీలక మార్పును సూచిస్తుంది.

    · Agnikul Cosmos కొత్త testing & manufacturing facilities: చెన్నైకి చెందిన space-tech startup Agnikul Cosmos సెప్టెంబర్ 8, 2026న చెన్నైలోని assembly and testing siteలో రెండు కొత్త సదుపాయాలను ప్రారంభించింది. అవి Stage Testing & Inspection Facility (STIF) మరియు Pressurant Tank Realisation, Over-wrapping and Outfitting Facility (PROOF).

    · UK CBAMలో భారత CCTSకు గుర్తింపు: యునైటెడ్ కింగ్‌డమ్ తన Carbon Border Adjustment Mechanism (CBAM) కింద overseas carbon pricing mechanismsకు సంబంధించిన indicative listలో భారత కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీం (CCTS)ను చేర్చింది. Ministry of Power పరిధిలోని Bureau of Energy Efficiency (BEE)కి CCTS, Carbon Border Adjustment Mechanism Regulations 2026లోని ప్రమాణాలను అందుకుంటుందని అధికారిక ధ్రువీకరణ లభించింది.

    · IFFJK 2026 ప్రారంభం: తొలి International Film Festival of Jammu and Kashmir (IFFJK) సెప్టెంబర్ 7, 2026న శ్రీనగర్‌లోని Sher-i-Kashmir International Convention Centre (SKICC)లో ప్రారంభమైంది. “Rang-e-Cinema” థీమ్‌తో సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు నాలుగు రోజుల పాటు ఈ చలనచిత్రోత్సవం జరుగుతుంది.

    · ఇంటర్నేషనల్ లిటరసీ డే 2026: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న International Literacy Dayను నిర్వహిస్తారు. అక్షరాస్యత ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాకుండా విద్య, ఉపాధి, సామాజిక భాగస్వామ్యం, సుస్థిర అభివృద్ధికి అవసరమైన పునాది అనే అంశాన్ని ఈ రోజు ప్రాధాన్యంగా చాటుతుంది. 2026లో ఈ దినోత్సవం 60వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది థీమ్ “Literacy for people, the planet and prosperity.”

    · ఎక్సర్సిస్ వీర్ గార్డియన్ 2026: భారత్–జపాన్ మధ్య రెండో బిలాటరల్ ఎయిర్ ఎక్సర్సిస్ – ఎక్సర్సిస్ వీర్ గార్డియన్ 2026 సెప్టెంబర్ 9 నుంచి 22, 2026 వరకు రాజస్థాన్‌లోని జోధాపూర్లో నిర్వహించనున్నారు. ఇరు దేశాల వైమానిక దళాల మధ్య ఇంటెరోపెరబిలిటీ మరియు ఆపరేషనల్ సినర్జీను బలోపేతం చేయడం ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం.

    · AH-64E Apache కోసం 400వ ‘Made in India’ Fuselage: హైదరాబాద్‌లోని Tata Boeing Aerospace Limited (TBAL) తయారీ కేంద్రం నుంచి AH-64E Apache attack helicopter కోసం 400వ ‘Made in India’ fuselageను విజయవంతంగా roll out చేసింది. భారతదేశంలో అధునాతన ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాల విస్తరణకు ఇది కీలక మైలురాయిగా నిలిచింది.

    · Pixxelకు $100 మిలియన్ల Series C నిధులు: భారత space-tech సంస్థ Pixxel Series C funding roundలో $100 million సమీకరించింది. ఉపగ్రహాల విస్తరణ, Earth Intelligence, space infrastructure సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వినియోగించనుంది.

    · 9వ Rashtriya Poshan Maah 2026: Ministry of Women and Child Development ఆధ్వర్యంలో 9వ Rashtriya Poshan Maah 2026ను సెప్టెంబర్ 9, 2026న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రారంభించనున్నారు. పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవన విధానం, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.