బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ 'టాక్సిక్' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఆగస్టు నెలాఖరులో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కియారా.. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అద్భుతమైన చీరలో మెరిసిపోయారు. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న 'నాడియా' పాత్రకు కూడా ఆయనే కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం విశేషం.
ఫ్యాషన్ సూపర్ విలన్ వైబ్స్..
'డార్క్ రొమాంటిసిజం' ఉట్టిపడేలా ఉన్న ఈ శారీ లుక్.. రాబోయే వింటర్ సీజన్ ఫ్యాషన్‌ను ముందుగానే పరిచయం చేస్తోంది. హాలీవుడ్ తారలు చార్లిజ్ థెరాన్ (The Odyssey), ఏంజెలీనా జోలీ (Maleficent) లాంటి వారు తమ సినిమాల ప్రమోషన్స్‌లో ప్రదర్శించిన 'ఫ్యాషన్ సూపర్ విలన్' వైబ్‌ను కియారా ఈ వెల్వెట్ చీరతో తీసుకువచ్చారు.
ఉంగరం నుంచి దూరిపోయేంత మృదువైన లేస్..
మనీష్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రీ-డ్రేప్డ్ చీరను మంచి మెరుపు, అత్యుత్తమ నాణ్యత కలిగిన ఇటాలియన్ వెల్వెట్‌తో రూపొందించారు. రినైజెన్స్ (Renaissance) కాలం నాటి నైపుణ్యంతో మాస్టర్ క్రాఫ్ట్స్‌మెన్ దీనిని అల్లారు. ఇక బ్లౌజ్ విషయానికొస్తే.. ఇటాలియన్ లేస్‌తో ఫుల్ స్లీవ్స్, క్వీన్ అన్నే నెక్ లైన్, క్లోజ్డ్ కాలర్‌తో డిజైన్ చేశారు. ఈ లేస్ ఎంత సున్నితమైనదంటే.. ఒక ఉంగరంలో నుంచి కూడా దాన్ని సులభంగా లాగేయవచ్చు. పురాతన చర్చిలలోని రంగుల అద్దాల గోడలను (Stained glass) తలపించేలా ఈ బ్లౌజ్ డిజైన్ అద్భుతంగా ఉంది.
పర్ఫెక్ట్ స్టైలింగ్..
సెలబ్రిటీ స్టైలిస్ట్ లక్ష్మీ లెహర్ కియారాను ముస్తాబు చేశారు. రాజ్వాడ జ్యువెల్స్ నుంచి ఎంపిక చేసిన ఎమరాల్డ్, డైమండ్ చోకర్, ఎక్స్‌ఎక్స్‌ఎల్ (XXL) పోల్కీ స్టడ్ ఇయర్ రింగ్స్ ఆమె ధరించారు. ఆక్వాజుర్రా (Aquazurra) బ్రాండ్ హీల్స్ వేసుకున్నారు. డ్రేప్డ్ బ్లష్, స్ట్రాంగ్ లాషెస్, న్యూడ్ లిప్‌తో పాటు వేసుకున్న సింపుల్ హెయిర్ బన్ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది.
వోగ్ ఎడిటర్ ఏమన్నారంటే..
"వెడ్డింగ్ రిసెప్షన్లు, కాక్‌టెయిల్ పార్టీల వంటి ఈవెనింగ్ ఈవెంట్లలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవాలనుకునే మహిళలకు ఈ తరహా డార్క్ రొమాంటిసిజం చీరలు బెస్ట్ ఛాయిస్. ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్ చలికాలంలో పెళ్లికూతురికి వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా రాయల్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్ల సీజన్‌లో చోకర్లు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. బ్లాక్ శారీకి కలర్ జెమ్‌స్టోన్స్ ఉండే డిజైనర్ చోకర్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది" అని వోగ్ ఇండియా ఫ్యాషన్ ఫీచర్స్ ఎడిటర్ అశ్విని అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
