ఇమాన్వీ పుట్టినరోజుకు ప్రభాస్ స్పెషల్ ట్రీట్.. ఫొటోలు వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఆతిథ్యంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ‘ఫౌజీ’ సినిమాలో ఆయనకు జోడీగా నటిస్తున్న ఇమాన్వీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా వంటకాలు పంపి సర్‌ప్రైజ్ ఇచ్చారు. టేబుల్ నిండా రకరకాల వంటకాలు ఉండటంతో ఇమాన్వీ ఆశ్చర్యపోయారు.
ప్రభాస్ పంపిన వంటకాల ఫొటోలను ఇమాన్వీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, “మనసు, కడుపు.. రెండూ నిండిపోయాయి” అనే భావంతో క్యాప్షన్ జోడించారు. ఈ ఫొటోలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సహనటులకు రుచికరమైన వంటకాలు పంపిస్తూ ఆతిథ్యం ఇవ్వడం ప్రభాస్‌కు అలవాటని ఆయనతో పనిచేసిన పలువురు నటీనటులు గతంలోనూ ప్రస్తావించారు. ఇప్పుడు ఇమాన్వీ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈ సర్‌ప్రైజ్ కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ‘ఫౌజీ’ సినిమాపై ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్న ప్రభాస్ అభిమానులు ఈ ఫొటోలపై స్పందిస్తూ తెలిసిందేగా మన డార్లింగ్ గురించి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
