99TV News

    మహాదేవపూర్ విద్యార్థులు బాల పురస్కారానికి షార్ట్‌లిస్ట్

    మహాదేవపూర్ విద్యార్థులు బాల పురస్కారానికి షార్ట్‌లిస్ట్

    మహాదేవపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జాతీయ స్థాయి గుర్తింపు

    ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి షార్ట్‌లిస్ట్ కావడంతో గ్రామీణ విద్యార్థుల ఆవిష్కరణలకు ప్రశంసలు వెల్లువెత్తాయి

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. వారి పేర్లు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి షార్ట్‌లిస్ట్ కావడంతో పాఠశాల వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

    విద్యార్థుల ప్రతిభకు ఉపాధ్యాయులు మడక మధు, మెరుగు తిరుపతి నిరంతర ప్రోత్సాహం అందించినట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి. ఈ ఆవిష్కరణలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్ల నారాయణ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

    HIGHLIGHTS

    - మహాదేవపూర్ విద్యార్థులకు జాతీయ గుర్తింపు

    - ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారానికి షార్ట్‌లిస్ట్

    - ఉపాధ్యాయుల ప్రోత్సాహానికి ప్రశంసలు

    విద్యార్థులు త్వరలో రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉందని, మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ వారి ప్రతిభ ప్రస్తావనకు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. తదుపరి అధికారిక ప్రకటన కోసం పాఠశాల, స్థానిక వర్గాలు ఎదురుచూస్తున్నాయి.