99TV News

    అన్నపూర్ణ స్టూడియోస్‌ రోడ్డు ప్రమాదం | Banjara Hills

    అన్నపూర్ణ స్టూడియోస్‌ సమీపంలో ప్రమాదకరంగా మారిన రోడ్డు

    అన్నపూర్ణ స్టూడియోస్‌ సమీపంలో డ్రైనేజీ నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్డు

    హైదరాబాద్‌: అన్నపూర్ణ స్టూడియోస్‌ సమీపంలోని జవహర్‌ కాలనీ రోడ్డుపై డ్రైనేజీ నీరు 24 గంటలూ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ఎత్తుపల్లాలతో ఉండటంతో నీరు బయటకు వెళ్లకుండా అక్కడే నిలుస్తోంది. దీంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రోజుకు కనీసం ఇద్దరు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు సమాచారం. మరోవైపు, KBR Park చుట్టూ వన్‌వే నిబంధనలతో ట్రాఫిక్‌ రద్దీ కూడా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. GHMC, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌, వాటర్‌ వర్క్స్‌–డ్రైనేజీ విభాగం, HRDCL అధికారులు సమస్యను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.