99TV News

    బాచుపల్లి భూ వివాదం: ADR ఎస్టేట్స్ MDకు 6 నెలల జైలు

    బాచుపల్లి భూ వివాదం: ADR ఎస్టేట్స్ MDకు 6 నెలల జైలు

    తెలంగాణలో బాచుపల్లి భూ వివాదం కీలక మలుపు తిరిగింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో ADR ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ చలసాని దామోదర్ రావుతో పాటు ముగ్గురు రిజిస్ట్రేషన్ అధికారులకు హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధించింది.

    మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని సర్వే నంబర్ 140లో ఉన్న భూమికి సంబంధించిన ఈ వివాదం కోర్టుకు చేరింది. 2023 ఫిబ్రవరిలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉండగానే రిజిస్ట్రేషన్లు చేపట్టారని పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

    శిక్ష పడినవారు వీరే

    చలసాని దామోదర్ రావు – ADR ఎస్టేట్స్ MD

    పి. శ్రీను – కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్

    వి. అశోక్ – జాయింట్ సబ్‌రిజిస్ట్రార్

    పి. మధుబాబు – జాయింట్ సబ్‌రిజిస్ట్రార్

    జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన ధర్మాసనం కోర్టు ఆదేశాల ఉల్లంఘనను పరిగణనలోకి తీసుకుని ఈ శిక్ష విధించింది. అయితే పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది.

    Highlights

    ADR ఎస్టేట్స్ MD సహా నలుగురికి ఆరు నెలల జైలు శిక్ష

    ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా

    బాచుపల్లి సర్వే నంబర్ 140 భూమిపై వివాదం

    అప్పీల్ కోసం శిక్ష అమలుపై నాలుగు వారాల నిలుపుదల