99TV News

    అలయ్ బలయ్ హైదరాబాద్‌లో ఘన ప్రారంభం | Bandaru Dattatreya

    బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నాంపల్లిలో ఘనంగా అలయ్ బలయ్

    అలయ్‌ బలయ్‌ వేడుకలు ఘనంగా ప్రారంభం

    నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు

    నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్‌ బలయ్‌ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి నిర్వహిస్తున్న ఈ వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కులమతాలకు అతీతంగా నేతలు, ప్రముఖులు హాజరుకానున్నారు.

    తెలంగాణ సంప్రదాయ వంటకాలతో అతిథులకు ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వనున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచినవారిని దత్తాత్రేయ, విజయలక్ష్మి సన్మానించనున్నారు. సోదరభావం, సామాజిక సమైక్యతకు ప్రతీకగా ఈ కార్యక్రమం కొనసాగనుంది.