99TV News

    చేవెళ్ల హత్య: ఫోన్ పాస్‌వర్డ్ వివాదం

    ఫోన్ పాస్‌వర్డ్ చెప్పలేదని వ్యక్తి హత్య.. చేవెళ్లలో కలకలం

    ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పలేదని వ్యక్తి హత్య

    చేవెళ్ల బస్‌స్టాండ్‌ వద్ద ఫోన్‌ లాక్కొని, డంపింగ్‌ యార్డు షెడ్డులో దాడి చేసినట్లు పోలీసుల వెల్లడి

    రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఠాణా పరిధిలో మొబైల్‌ ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పలేదన్న ఆగ్రహంతో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం, బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చేవెళ్ల బస్‌స్టాండ్‌ వద్ద 43 ఏళ్ల వ్యక్తి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను కొందరు లాక్కున్నారు.

    అనంతరం బాధితుడిని చేవెళ్ల మున్సిపల్‌ కందవాడ వార్డు పరిధిలోని డంపింగ్‌ యార్డు షెడ్డులోకి తీసుకెళ్లి ఫోన్‌ లాక్‌ తీసేందుకు పాస్‌వర్డ్‌ చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. బాధితుడు నిరాకరించడంతో కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత ఫోన్‌ను డంపింగ్‌ యార్డులోని మంటల్లో పడేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

    HIGHLIGHTS

    - బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఘటన

    - చేవెళ్ల బస్‌స్టాండ్‌ వద్ద ఫోన్‌ లాక్కున్న దుండగులు

    - గురువారం మధ్యాహ్నం ఒక నిందితుడు లొంగుబాటు

    గురువారం మధ్యాహ్నం ఒక నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయి ఘటన వివరాలు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.