హైదరాబాద్‌లో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్‌కు దిగి ముగ్గురు కార్మికులు మృతి
బాచుపల్లిలోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్‌లో విషవాయువులు పీల్చి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారుల ప్రాథమిక నిర్ధారణ
హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన జరిగింది. ఏపీఆర్ ఎన్‌క్లేవ్‌లోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్‌కు దిగిన 3 మంది కార్మికులు విషవాయువులు పీల్చి ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు, అత్యవసర విభాగాల అధికారులు తెలిపారు.
మృతులను శ్రీకాకుళం జిల్లాకు చెందిన పవన్ యల్లా 20, కె.షణ్ముఖరావు అలియాస్ సుమన్ 26, సురేష్ 24గా అధికారులు గుర్తించారు. అపార్ట్‌మెంట్ యాజమాన్య సంఘం, హెచ్‌ఆర్ ఇన్విరో అనే ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ మధ్య సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పనులకు ఒప్పందం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ సంస్థకు చెందిన కార్మికులు పనుల కోసం అపార్ట్‌మెంట్‌కు వచ్చి, ఒకరి తర్వాత ఒకరు ట్యాంక్‌లోకి దిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కొంతసేపటికి వారు బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీస్, ఫైర్, అత్యవసర సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
బాచుపల్లి పోలీస్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించారా, రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు.
HIGHLIGHTS
- బాచుపల్లి దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్‌లో ఘటన
- మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 3 కార్మికులు
- హైడ్రా, ఫైర్ సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు
- విషవాయువులే కారణమని ప్రాథమిక నిర్ధారణ
సమాచారం అందిన వెంటనే హైడ్రా ఎస్ఎఫ్ఓ శ్రీనివాస్ నేతృత్వంలోని డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ట్యాంక్‌లో దట్టమైన విషవాయువులు ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టమైందని అధికారులు తెలిపారు. ప్రత్యేక రెస్క్యూ పరికరాల సాయంతో ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి తదుపరి ప్రక్రియల కోసం తరలించారు.
పోస్టుమార్టం నివేదిక, టెక్నికల్ పరిశీలనల ఆధారంగా మరిన్ని వివరాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. కాంట్రాక్టు సంస్థ, అపార్ట్‌మెంట్ యాజమాన్యం నుంచి వివరాలు సేకరించి బాధ్యత నిర్ధారణపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
