99TV News

    గాంధీ జయంతి: Hyderabad Jain Community Car Rally

    గాంధీ జయంతి వేళ జైన్ కమ్యూనిటీ 23 కిలోమీటర్ల తిరంగ అహింస కార్ ర్యాలీ

    గాంధీ జయంతి వేళ హైదరాబాద్‌లో 23 కిలోమీటర్ల తిరంగ అహింస కార్ ర్యాలీ

    జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో 187 కార్లు పాల్గొన్నాయి

    గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో 23 కిలోమీటర్ల ‘తిరంగ అహింస కార్ ర్యాలీ’ నిర్వహించారు. జల్ విహార్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన మార్గాల మీదుగా సాగి అక్కడే ముగిసింది.

    శ్రీ వర్ధమాన్ స్థానక్‌వాసి జైన్ శ్రావక్ సంఘ్, గ్రేటర్ హైదరాబాద్ కాచిగూడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ పతాకాలు, జైన్ జెండాలతో అలంకరించిన దాదాపు 187 కార్లు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. చీఫ్ కన్వీనర్లు మనోజ్ కొఠారీ, ధర్మేంద్ర నహార్, ప్రశాంత్ కొచేటా, అన్రాజ్ బట్నా, నేమిచంద్ బుకియా, సురేష్ గుండేచా, ప్రేమ్ కొఠారీ ముఖ్య అతిథుల సమక్షంలో ర్యాలీని ప్రారంభించారు.

    జల్ విహార్ వద్ద ప్రారంభమైన ర్యాలీ సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, రాణిగంజ్, ప్యారడైజ్, బేగంపేట్, సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా సాగింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ముందస్తు సమన్వయంతో ర్యాలీ నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్పారు.

    ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పోలీస్ అధికారి మహేష్ భగవత్ మాట్లాడుతూ, “దేశమే ప్రథమం.. మతం తర్వాతే అనే సందేశాన్ని చాటిచెప్పేలా ఈ ర్యాలీని నిర్వహించారు” అన్నారు. “దేశభక్తి, అహింసా విలువలను కలిపిన కార్యక్రమం ఇది” అని ఆయన నిర్వాహకులను అభినందించారు.

    HIGHLIGHTS

    - 23 కిలోమీటర్ల కార్ ర్యాలీ

    - దాదాపు 187 కార్ల పాల్గొనడం

    - జల్ విహార్ నుంచి ప్రారంభం

    - మహేష్ భగవత్ పాల్గొనడం

    చీఫ్ కన్వీనర్ మనోజ్ కొఠారీ మాట్లాడుతూ, “గాంధీ జయంతి రోజున అహింసా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మా లక్ష్యం” అన్నారు. మరో చీఫ్ కన్వీనర్ ధర్మేంద్ర నహార్ మాట్లాడుతూ, “జైన్ కమ్యూనిటీ ఎప్పుడూ శాంతి, సేవ, దేశభక్తి విలువలకు కట్టుబడి ఉంటుంది” అన్నారు. ప్రశాంత్ కొచేటా మాట్లాడుతూ, “యువతలో జాతీయ భావనను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తాం” అన్నారు.

    పూజ్య ఆచార్య జ్ఞానచంద్ర జీ మహారాజ్ జన్మదినం, గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, అంతర్జాతీయ అహింసా దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ ఏర్పాటు చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. రాబోయే రోజుల్లో అహింస, సేవ, పర్యావరణ అవగాహన కార్యక్రమాలను మరింత విస్తరించాలని నిర్వాహకులు నిర్ణయించారు.