99TV News

    NIMS Hyderabad OP Timings: మధ్యాహ్నం 2 గంటల వరకు రిజిస్ట్రేషన్లు

    NIMS Hyderabad OP Timings: మధ్యాహ్నం 2 గంటల వరకు రిజిస్ట్రేషన్లు

    నిమ్స్‌లో ఓపీ రిజిస్ట్రేషన్ల సమయం పెంపు

    హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో ఔట్‌పేషెంట్ (ఓపీ) రిజిస్ట్రేషన్ సమయాన్ని పొడిగించారు. గతంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉన్న రిజిస్ట్రేషన్లను ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగించనున్నారు. ఈ నిర్ణయంతో దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మరింత వెసులుబాటు కలగనుంది. పెరిగిన రిజిస్ట్రేషన్ సమయానికి అనుగుణంగా వైద్యులు సైతం సాయంత్రం వరకు అందుబాటులో ఉండనున్నారు.

    రోగులకు వైద్య పరీక్షలు, స్పెషలిస్టుల అపాయింట్‌మెంట్ల విషయంలో ఎదురవుతున్న నిరీక్షణను తగ్గించేందుకు ఆసుపత్రి అధికారులు చర్యలు చేపట్టారు. ఓపీ రిజిస్ట్రేషన్ జరిగిన రోజే ఎంఆర్‌ఐ మినహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల నివేదికలు ఒకటి నుంచి రెండు గంటల్లో అందుబాటులోకి వస్తే, అదే రోజు వైద్యులను సంప్రదించి చికిత్స పొందే అవకాశం ఉంటుంది. ఈ మార్పులతో రోగుల సమయం ఆదా కావడంతో పాటు వైద్య సేవలు మరింత సులభతరం కానున్నాయి.