99TV News

    Hyderabad Outskirts: అన్నూజిగూడ ఫ్లైఓవర్‌పై రెనాల్ట్ కారులో మంటలు

    Hyderabad Outskirts: అన్నూజిగూడ ఫ్లైఓవర్‌పై రెనాల్ట్ కారులో మంటలు

    అన్నూజిగూడ ఫ్లైఓవర్‌పై రెనాల్ట్ కారులో అగ్నిప్రమాదం

    హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లాలో ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అన్నూజిగూడ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న రెనాల్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బయటకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది.

    వరంగల్ నుంచి వస్తున్న ప్రయాణికులు పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని ఫ్లైఓవర్‌పైకి చేరుకోగానే ఇంజిన్ భాగం నుంచి మంటలు వ్యాపించినట్లు సమాచారం. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

    పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక లోపం కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నప్పటికీ, ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది.