99TV News

    కెప్టెన్ స్మిత్‌కు మోదీ ప్రశంసలు | Flydubai Pilot

    9/11 తరహా విషాదాన్ని అడ్డుకున్న కెప్టెన్ స్మిత్‌పై మోదీ ప్రశంసలు

    ‘9/11 తరహా విషాదాన్ని అడ్డుకున్న భారతీయుడు’.. కెప్టెన్ స్మిత్‌పై మోదీ ప్రశంసలు

    న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్‌ విమానం FZ1073లో పెను ప్రమాదాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి వందలాది ప్రాణాలను కాపాడిందని మోదీ పేర్కొన్నారు.

    దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో కాక్‌పిట్‌లో స్మిత్‌పై సహ పైలట్‌ దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు. అనంతరం విమానం ఒక్కసారిగా భారీగా కిందకు దిగింది. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వివరాల ప్రకారం విమానం సుమారు 14,000 అడుగుల ఎత్తును 30 సెకన్లలోపు కోల్పోయింది.

    HIGHLIGHTS

    - ఫ్లైదుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 విమానంలో 174 మంది ఉన్నారు

    - విమానం 17,000 అడుగుల ఎత్తు కోల్పోయింది

    - కెప్టెన్‌ స్మిత్‌ సౌదీ అరేబియాలో చికిత్స పొందుతున్నారు

    - ఆయన పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు

    గాయపడినప్పటికీ స్మిత్‌ కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో ఉన్న 174 మంది సురక్షితంగా బయటపడ్డారు.

    ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కూడా స్మిత్‌ ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఆయనను “నిజమైన హీరో”గా అభివర్ణించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, స్మిత్‌ సౌదీ అరేబియాలో చికిత్స పొందుతున్నారు.