99TV News

    Flydubai కోపైలట్ హమమ్ అల్ హమ్మమి కుట్ర వివరాలు

    Flydubai కోపైలట్ హమమ్ అల్ హమ్మమి.. ఇజ్రాయెల్‌లో విమానం కూల్చేందుకు కుట్ర

    ఫ్లైదుబాయ్ కోపైలట్‌పై విచారణ తీవ్రం

    ఇజ్రాయెల్‌లో విమానం కూల్చే కుట్ర కోణంలో హమమ్ అల్ హమ్మమిపై దర్యాప్తు కొనసాగుతోంది

    దుబాయ్ నుంచి టెల్ అవివ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసిన కోపైలట్‌ను హమమ్ అల్ హమ్మమిగా గుర్తించారు. 174 మంది ప్రయాణికులతో ఉన్న విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా దించారు.

    ఒమన్ దేశస్థుడైన హమ్మమి యూఏఈలో జన్మించి, సిరియాలో ఎక్కువ కాలం గడిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తీవ్రవాద భావజాలానికి సంబంధించిన మెటీరియల్ అతని వద్ద గతంలో గుర్తించడంతో ఒమన్ అధికారులు అతనిపై ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. 2024లో ఒమన్ ఎయిర్‌లో కోపైలట్ శిక్షణ పొందిన తర్వాత అతన్ని ఫ్లయింగ్ విధుల నుంచి తప్పించి అడ్మినిస్ట్రేటివ్ రోల్‌కు పరిమితం చేశారు.

    HIGHLIGHTS

    - కోపైలట్ పేరు హమమ్ అల్ హమ్మమి

    - విమానంలో 174 మంది ప్రయాణికులు

    - తబుక్‌లో అత్యవసర ల్యాండింగ్

    - ఇజ్రాయెల్ రూట్‌పై దర్యాప్తు

    ఫ్లైదుబాయ్ అతన్ని సున్నితమైన యూఏఈ-ఇజ్రాయెల్ రూట్‌లో నియమించడంపై భద్రతా సమీక్ష ప్రారంభమైంది. దర్యాప్తు సంస్థలు అతని ఉద్యోగ నేపథ్యం, ప్రయాణ వివరాలు, గత ఆంక్షల అమలు పద్ధతిని పరిశీలిస్తున్నాయి. విమానయాన భద్రతా ప్రమాణాలపై తదుపరి నిర్ణయాలు విచారణ నివేదిక తర్వాత వెలువడే అవకాశం ఉంది.