99TV News

    జైశంకర్ వ్యాఖ్యలు: US lonelier powerగా మారిందా

    US lonelier powerగా మారిందని జైశంకర్ వ్యాఖ్య

    అమెరికా ‘ఒంటరి శక్తి’గా మారాలని ఎంచుకుంది: జైశంకర్

    మ్యూనిక్ సమావేశంలో రష్యాతో భారత బంధం, ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలపై విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు

    విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మ్యూనిక్ లీడర్స్ మీటింగ్‌లో మాట్లాడుతూ అమెరికా ప్రపంచ వ్యవస్థలో తన పాత్రను తీవ్రంగా మార్చుకుంటోందని, “ఒంటరి శక్తి”గా మారాలని ఎంచుకుందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు భారత్ మరింత చురుకైన దౌత్యపాత్రను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

    “ప్రపంచంలోని చాలా దేశాలు మన పక్కనున్న సైనిక పాలనకు మద్దతు ఇచ్చినప్పుడు, రష్యాతో మన సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి,” అని జైశంకర్ అన్నారు. “ఆ వారసత్వం మనలను అనేక విధాలుగా తీర్చిదిద్దింది,” అని ఆయన చెప్పారు.

    HIGHLIGHTS

    - మ్యూనిక్‌లో జైశంకర్ వ్యాఖ్యలు

    - అమెరికా పాత్ర మారుతోందని వ్యాఖ్య

    - రష్యాతో భారత దీర్ఘకాల బంధం ప్రస్తావన

    - ఉక్రెయిన్ శాంతిపై భారత్ ప్రతిపాదనలు

    “ఈ ఘర్షణ ముగియాలని మేము కోరుకుంటున్నాం. ఇందుకు సంభాషణ, దౌత్యం అవసరం,” అని జైశంకర్ అన్నారు. “ఇటీవలి నెలల్లో మేము కేవలం వాదనకే పరిమితం కాకుండా కొంచెం ఎక్కువగా పాలుపంచుకుంటున్నాం,” అని ఆయన చెప్పారు. బ్లాక్ సీ షిప్పింగ్ భద్రత, ధాన్యం ఎగుమతులు, ఎనర్జీ ఎగుమతులు, దాడులు నివారించే అవకాశాలపై రష్యా, ఉక్రెయిన్‌తో చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

    “ప్రస్తుత వ్యవస్థకు అమెరికా గణనీయంగా అండగా నిలిచింది. ఆ అండ తగ్గుతోంది,” అని జైశంకర్ అన్నారు. అమెరికా-చైనా పోటీ ప్రభావం ఇతర దేశాలపైనా పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తదుపరి చర్చల్లో భారత్ ప్రతిపాదనల రూపురేఖలు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.