99TV News

    జపాన్ శతాధికులు 1,07,677కు.. ప్రపంచ రికార్డు

    జపాన్‌లో శతాధికుల సంఖ్య 1,07,677కు చేరి ప్రపంచ రికార్డు

    జపాన్‌లో లక్షకు పెరగని శతాధికుల సంఖ్య ఇదో ప్రపంచ రికార్డు!

    వయసు పెరుగుతున్న కొద్దీ జీవితం నెమ్మదిస్తుందని అంటారు. కాని జపాన్‌లో మాత్రం వందేళ్లు దాటిన వారి సంఖ్య పరుగులు తీస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా లక్ష మందికి పైగా!

    జపాన్‌లో తొలిసారిగా శతాధికుల సంఖ్య లక్ష మార్కును దాటింది. దేశంలో ప్రస్తుతం 1,07,677 మంది 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నట్లు జపాన్ ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 15న ప్రకటించింది. ఇది సాధారణ పెరుగుదల కాదు. జపాన్‌లో శతాధికుల సంఖ్య పెరగడం వరుసగా 56వ సంవత్సరం. అంటే ఐదున్నర దశాబ్దాలుగా ప్రతి ఏడాది వందేళ్లు దాటిన వారి సంఖ్య కొత్త రికార్డు సృష్టిస్తూనే ఉంది.

    లక్ష దాటిన శతాధికుల్లో దాదాపు 88 శాతం మంది మహిళలే. మొత్తం 1,07,677 మందిలో 94,298 మంది మహిళలు కాగా, పురుషుల సంఖ్య 13,379గా ఉంది. అంటే జపాన్‌లో వందేళ్లు దాటిన ప్రతి 100 మందిలో దాదాపు 88 మంది మహిళలే!

    ప్రస్తుతం జపాన్‌లో అత్యంత వృద్ధురాలిగా క్యోటోకు చెందిన 114 ఏళ్ల ఫుయో కిషిమోటో రికార్డుల్లో ఉన్నారు. ఇక అత్యంత వృద్ధుడిగా కుమామోటోకు చెందిన 112 ఏళ్ల హికారు కాటో గుర్తింపు పొందారు

    153 మందితో మొదలై.. లక్ష దాటిన ప్రయాణం

    జపాన్‌లో శతాధికుల సంఖ్య ఒక్కసారిగా పెరగలేదు. దీని వెనుక దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం ఉంది.

    1963లో ప్రభుత్వం వందేళ్లు దాటిన వారి సంఖ్యను అధికారికంగా నమోదు చేయడం ప్రారంభించినప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 153 మంది మాత్రమే శతాధికులుగా ఉన్నారు. ఆ తర్వాత సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1981లో తొలిసారి 1,000 మార్కును దాటింది. 1998లో 10,000కు చేరింది. 2012లో 50,000 మార్కును అధిగమించింది. ఇప్పుడు.. అంటే కేవలం 14 ఏళ్లలో ఆ సంఖ్య లక్షను కూడా దాటేసింది. అంటే శతాధికుల సంఖ్య ఏకంగా 700 రెట్లకు పైగా పెరిగింది!

    ఇంత దీర్ఘాయుష్షుకు కారణమేంటి?

    జపాన్‌లో ప్రజలు ఎక్కువ కాలం జీవించడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెరుగైన వైద్య సేవలు, ప్రజారోగ్యంలో పురోగతి, జీవన ప్రమాణాల్లో మార్పులు, ఆరోగ్యంపై శ్రద్ధ వంటి అంశాలు దీర్ఘాయుష్షుకు దోహదం చేశాయి. జపాన్‌లో సంప్రదాయంగా ఆరోగ్యకరమైన ఆహారం, చేపలు, కూరగాయలు, తక్కువ కొవ్వు కలిగిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా తరచుగా ప్రస్తావించబడుతుంది. పాన్ ఆరోగ్య శాఖ మంత్రి కెనిచిరో యునో కూడా వైద్య, సాంకేతిక రంగాల్లో వచ్చిన పురోగతి ప్రజలకు మరింత ఆరోగ్యకరమైన, క్రియాశీలక జీవితాన్ని అందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు.