అస్సాం రైఫిల్స్‌లో 354 టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
గ్రూప్ సి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం; అక్టోబర్ 28 వరకు గడువు
కేంద్ర సాయుధ దళాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అస్సాం రైఫిల్స్ 2026 రిక్రూట్‌మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ విభాగాల్లో మొత్తం 354 గ్రూప్ సి పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు కోరింది.
నోటిఫికేషన్ ప్రకారం వారంట్ ఆఫీసర్, హవల్దార్, రైఫిల్‌మ్యాన్ కేడర్లలో ఖాళీలు ఉన్నాయి. వారంట్ ఆఫీసర్ 129, హవల్దార్ 6, రైఫిల్‌మ్యాన్ 219 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్, లైన్‌మ్యాన్ ఫీల్డ్, ఆర్మరర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మాసన్, ఫిజియోథెరపిస్ట్ తదితర విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత డిప్లొమా లేదా ఐటీఐ అర్హతలు పోస్టును బట్టి అవసరమని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏండ్లలోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏండ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఫలితాల ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రకటించి నియామకాలు చేపడతారు.
HIGHLIGHTS
- మొత్తం ఖాళీలు 354
- దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 28
- ర్యాలీ నవంబర్ 23 నుంచి ఉండే అవకాశం
- దరఖాస్తు ఫీజు రూ. 100
రైఫిల్‌మ్యాన్ లెవల్ 3 పోస్టులకు జీతం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఉంటుంది. హవల్దార్ లెవల్ 4 పోస్టులకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు వేతనం వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు రూ. 100గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28లోగా అధికారిక వెబ్‌సైట్ www.assamrifles.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్‌మెంట్ ర్యాలీ నవంబర్ 23 నుంచి నిర్వహించే అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తు చేసుకున్నవారు సంబంధిత సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాలు, విద్యార్హత ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
