ఆర్మీలో 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు నోటిఫికేషన్ విడుదల
30 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 29 వరకు స్వీకరణ
భారత సైన్యం 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 2027 జూలైలో ప్రారంభమయ్యే ఈ కోర్సు ద్వారా 30 పోస్టులను భర్తీ చేయనుంది.
అవివాహిత పురుష ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు భారత సైన్యంలో శాశ్వత కమిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్మీ తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 30న ప్రారంభమై అక్టోబర్ 29తో ముగుస్తుంది. సివిల్‌లో 8, ఎలక్ట్రికల్‌లో 2, కంప్యూటర్ సైన్స్‌లో 6, మెకానికల్‌లో 6, ఎలక్ట్రానిక్స్‌లో 6, మిసెల్లెనియస్ ఇంజినీరింగ్ స్ట్రీమ్స్‌లో 2 ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్ లేదా ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న బీఈ, బీటెక్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2027 జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికలో ముందుగా విద్యార్హత మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, తరువాత SSB ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
HIGHLIGHTS
- మొత్తం ఖాళీలు 30
- దరఖాస్తులు సెప్టెంబర్ 30 నుంచి
- చివరి తేదీ అక్టోబర్ 29
- కోర్సు 2027 జూలైలో ప్రారంభం
- శిక్షణ తర్వాత లెఫ్టినెంట్ హోదా
SSB ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా సిద్ధమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరుతారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే స్వీకరించనున్నారు. ఇతర అర్హత నిబంధనలు, బ్రాంచ్‌లవారీ వివరాలు, దరఖాస్తు విధానం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.inను పరిశీలించాలి.
