99TV News

    కర్ణాటకలో బాల కార్మికులపై దాడులు, 800 మంది పిల్లలకు విముక్తి

    కర్ణాటకలో బాల కార్మికులపై దాడులు, 800 మంది పిల్లలకు విముక్తి

    బాల కార్మికులపై పోలీసుల దాడులు.. కర్ణాటకలో 800 మంది పిల్లలకు విముక్తి

    బెంగళూరు: కర్ణాటకలో బాల కార్మిక వ్యవస్థపై పోలీసులు, కార్మిక శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా 800 మంది బాల కార్మికులను గుర్తించి రక్షించారు. వీరిలో ఒక్క బెంగళూరులోనే 503 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

    బాల కార్మికులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు, కార్మిక శాఖ అధికారులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 16,950 ప్రదేశాలను తనిఖీ చేసినట్లు సమాచారం. బెంగళూరులోని 503 మంది పిల్లలను కేవలం రెండు గంటల్లోనే గుర్తించి రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.

    బెంగళూరులో అత్యధిక కేసులు

    బెంగళూరులో గుర్తించిన బాల కార్మికుల్లో ఎక్కువ మంది హోటళ్లు, రెస్టారెంట్లు, వర్క్‌షాప్‌లు, గోదాములు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది పిల్లలను వారి తల్లిదండ్రులు పనిలో పెట్టారని, మరికొందరిని మధ్యవర్తుల ద్వారా పనిలోకి తీసుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు కథనంలో పేర్కొన్నారు.

    బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని అధికారులు తెలిపారు. Child and Adolescent Labour (Prohibition and Regulation) Act, 1986, అలాగే Juvenile Justice Act, 2015 నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

    విజ‌యపుర, తుమకూరులోనూ పిల్లలకు విముక్తి

    బెంగళూరు తర్వాత విజయపుర, తుమకూరు జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో బాల కార్మికులను గుర్తించినట్లు సమాచారం. విజయపుర జిల్లాలో 72 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 116 మంది పిల్లలను రక్షించారు. తుమకూరులో 33 మంది బాల కార్మికులను అధికారులు గుర్తించినట్లు కథనంలో పేర్కొన్నారు.

    రక్షించిన పిల్లలను సంబంధిత అధికారులకు అప్పగించి, వారి పునరావాసం కోసం చర్యలు చేపట్టినట్లు సమాచారం. బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

    పునరావాసంపై దృష్టి

    రక్షించిన పిల్లలను కేవలం పనుల నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా, వారికి అవసరమైన పునరావాసం, విద్య, సంక్షేమ చర్యలు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పిల్లల భద్రత, హక్కులను కాపాడేందుకు బాల కార్మిక వ్యవస్థపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.