99TV News

    Chiranjeevi’s Megaverse on Netflix: Pawan Kalyan and Ram Charan Reunion?

    Chiranjeevi’s Megaverse on Netflix: Pawan Kalyan and Ram Charan Reunion?

    చిరంజీవి హోస్ట్‌గా మెగా సందడి

    నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా ‘మెగావర్స్’

    బాబాయ్.. అబ్బాయ్ ఒకే ఫ్రేమ్‌లో!

    పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్ లతో చిరు అల్లరి

    అక్కినేని కుటుంబం సందడి కూడా ఉంటుందా?

    మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అరుదైన కలయికకు రంగం సిద్ధమవుతోందా? మెగాస్టార్ చిరంజీవి,

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపించబోతున్నారా? నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి హోస్ట్‌గా

    వ్యవహరించనున్న ‘మెగావర్స్’ టాక్ షోపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బాబాయ్ పవన్, అబ్బాయి

    చరణ్‌లతో చిరంజీవి చేసే ముచ్చట్లు ఎలా ఉంటాయన్నది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

    వెండితెరపై దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి ఇప్పుడు ఓటీటీ వేదికపై హోస్ట్‌గా సందడి చేయబోతున్నారు.

    నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న ఈ కార్యక్రమానికి ‘చిరంజీవీస్ మెగావర్స్’ అనే పేరు పెట్టారు. తెలుగు సినిమా చరిత్ర, సినీ

    ప్రముఖుల అనుభవాలు, వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర సంగతులను ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు. చిరంజీవి

    కెరీర్‌లో ఇదొక కొత్త ప్రయత్నం. ఈ షో చిత్రీకరణ ప్రారంభమైనట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

    ఈ షోకు సంబంధించి ఎక్కువగా వినిపిస్తున్న ఆసక్తికరమైన వార్త ఇదే. చిరంజీవి హోస్ట్‌గా ఉండగా, పవన్ కల్యాణ్, రామ్

    చరణ్ అతిథులుగా ఒకే ఎపిసోడ్‌లో పాల్గొనటం..అందులో వాళ్లేం మాట్లాడుకుంటారనే అంశంపైన చర్చ సాగుతోంది.

    మెగాస్టార్ చిరంజీవి షో హోస్ట్ గా ఉండగా ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తనయుడు రామ్ చరణ్..

    ఈ ముగ్గురూ ఒకే వేదికపై కూర్చొని మాట్లాడుకుంటే అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతి కలగడం ఖాయం. సినిమాలు,

    కుటుంబ అనుబంధాలు, చిరంజీవి-పవన్ మధ్య అనుభవాలు, చరణ్ చిన్ననాటి సంగతులు చర్చకు వస్తాయా? అన్న

    అంశంపైన ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మెగావర్స్‌లో మరో ఆసక్తికరమైన కలయిక అక్కినేని కుటుంబం. నాగార్జున,

    నాగచైతన్య, అఖిల్‌లతో చిరంజీవి ప్రత్యేక ఎపిసోడ్‌లో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తం మీద 'మెగావర్స్’ సినీ

    సర్కిల్స్ లో కలకలం రేపుతోంది.